Home /News /movies /

KANGANA RANAUT TEAM SAYS THE CENTRAL GOVERNMENT TO TAKE BACK KARAN JOHAR PADMA SHRI AWARD HERE ARE THE DETAILS TA

Kangana Ranaut: కరణ్ జోహార్ పై మరోసారి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..

కరణ్ జోహార్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)

కరణ్ జోహార్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)

Kangana Ranaut Karan Johar | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఎపుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చెప్పడం కష్టమే. తాజాగా ఈమె కరణ్ జోహార్‌కు కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఎపుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చెప్పడం కష్టమే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లోని నెపోటిజంతో పాటు అవార్డుల ఎంపికకై ఎప్పటి కప్పడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతునే ఉంది. తాజాగా కంగనా బాలీవుడ్ దర్శక, నిర్మాత నటుడు కరణ్ జోహార్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం కంగనా.. కంగనా రనౌత్ టీమ్ పేరిట ట్వీట్స్ చేస్తోంది. తాజాగా మకరణ్ జోహార్ పై  ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో కంగనా.. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం కరణ్ జోహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అతను తనను ఎన్నో సార్లు బహిరంగంగా నన్ను బెదిరించాడు. అంతేకాదు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పరిశ్రమ నుండి తనను వెళ్లిపొమ్మని బెదిరించాడు. సుశాంత్ కెరీర్‌ను దెబ్బ తీసేందకు కుట్ర పన్నాడంటూ తన ట్వీట్‌లో తెలిపింది. అంతేకాదు కేంద్రం ప్రభుత్వం చేసిన ఉరి సర్టికల్ స్ట్రైక్ పై విమర్శలు చేసాడు. ఇపుడు ఓ యాంటీ నేషనల్ ఫిల్మ్ తీయబోతున్నట్టు తన ట్వీట్‌లో తెలిపింది.

    బాలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి కరణ్ జోహార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందన్నారు. వీళ్లందరు కలిసి సిండికేట్‌గా ఏర్పడి సుశాంత్‌కు రావాల్సిన అవకాశాలను రాకుండా చేసారని కంగనా పలుమార్లు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. ఈయేడాది కేంద్రం సినీ రంగం నుంచి కరణ్ జోహార్‌ను పద్మశ్రీ బిరుదుకు ప్రధానం చేసింది. కరణ్‌తో పాటు నిర్మాత ఏక్తా కపూర్, గాయకుడు అద్నన్ సమీతో పాటు కంగనాకు కూడా కేంద్ర పద్మశ్రీ బిరుదు ప్రధానం చేసిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood, Central Government, Kangana Ranaut, Karan Johar, Padma Shri, Sushant Singh Rajput

    తదుపరి వార్తలు