#MeToo: అత‌డి భార్య‌కు కంగ‌న ర‌నౌత్ చెప్పే స‌మాధాన‌మేంటి..?

కొన్ని రోజుల నుంచి ఇండియా మొత్తంలో ఒక్క‌టే వార్త వినిపిస్తుంది. అదే మీటూ.. ఎవ‌రి నోట విన్నా కూడా ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక కంగ‌న ర‌నౌత్ కూడా ముందు నుంచి ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2018, 4:09 PM IST
#MeToo: అత‌డి భార్య‌కు కంగ‌న ర‌నౌత్ చెప్పే స‌మాధాన‌మేంటి..?
మరోవైపు తనకు 17 ఏళ్లున్నపుడే 28 ఏళ్ల అబ్బాయిని ప్రేమించానని.. తను చిన్నపిల్ల అని పిలిచినపుడు మాత్రం గుండె బద్ధలైపోయేదని చెప్పింది కంగన. ఏదేమైనా కూడా కంగన రనౌత్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
  • Share this:
కొన్ని రోజుల నుంచి ఇండియా మొత్తంలో ఒక్క‌టే వార్త వినిపిస్తుంది. అదే మీటూ.. ఎవ‌రి నోట విన్నా కూడా ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక కంగ‌న ర‌నౌత్ కూడా ముందు నుంచి ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తుంది. త‌న‌ను ఆఫ‌ర్ల కోసం చాలా మంది వాడుకున్నార‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. కెరీర్ మొద‌ట్లో తాను చాలా దారిద్య్రం అనుభ‌వించాన‌ని.. చివ‌రికి రోడ్ల ప‌క్క‌న కూడా ప‌డుకున్నాన‌ని చెప్పింది కంగ‌న‌. .

#MeToo: అత‌డి భార్య‌కు కంగ‌న ర‌నౌత్ చెప్పే స‌మాధాన‌మేంటి..? kangana ranaut targeted by vikas bahl ex wife.. #MeToo,#MeToo movement,kangana ranaut, bollywood,queen,targeted by vikas bahl, ex wife,hindi cinema,కంగన రనౌత్,వికాస్ భెల్,హిందీ సినిమా,బాలీవుడ్,క్యాస్టింగ్ కౌచ్,మాజీ భార్య,వికాస్ మాజీ భార్య, మీటూ ఉద్యమం,మీటూ
కంగన రనౌత్


ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో కూడా కొంద‌రు ద‌ర్శ‌కులు, హీరోల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ముఖ్యంగా త‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు వికాస్ భెల్‌ను కూడా టార్గెట్ చేసింది ఈ భామ‌. "క్వీన్" సినిమా ద‌ర్శ‌కుడిపై కావాల్సిన‌న్ని క‌మెంట్స్ చేసింది కంగ‌న‌. ఇప్పుడు ఈయ‌న మాజీ భార్య.. అత‌డికి స‌పోర్ట్ చేసింది. ఒకవేళ నిజంగానే వికాస్ అంత చెడ్డ‌వాడు అయితే.. అమ్మాయిల పిచ్చోడు అయితే ఎందుకు కంగ‌న అత‌డితో స్నేహం చేసింది.. పార్టీలు చేసుకుంది.. ఒక్క‌సారి మిస్ బిహేవ్ చేసిన త‌ర్వాత ఏ అమ్మాయైనా మ‌ళ్లీ అత‌డితో అంత క్లోజ్ గా ఉంటుందా... మ‌రి కంగ‌న ఎందుకు ఉన్న‌ట్లు..?

#MeToo: అత‌డి భార్య‌కు కంగ‌న ర‌నౌత్ చెప్పే స‌మాధాన‌మేంటి..? kangana ranaut targeted by vikas bahl ex wife.. #MeToo,#MeToo movement,kangana ranaut, bollywood,queen,targeted by vikas bahl, ex wife,hindi cinema,కంగన రనౌత్,వికాస్ భెల్,హిందీ సినిమా,బాలీవుడ్,క్యాస్టింగ్ కౌచ్,మాజీ భార్య,వికాస్ మాజీ భార్య, మీటూ ఉద్యమం,మీటూ
కంగన రనౌత్


అవ‌కాశాలు ఇస్తాడు.. టాలెంట్ ఉంది కాబ‌ట్టి ఆ స‌మ‌యానికి ఎలా ఉన్నా ప‌ర్లేదని అమ్మాయిలు అనుకుంటారా..? అని రివ‌ర్స్ అటాక్ చేసింది. దీనికి స‌మాధానం చెప్ప‌డానికి కంగ‌న ర‌నౌత్ ముందుకు రాలేదు కానీ వికాస్ మాజీ భార్య‌పై కౌంట‌ర్స్ అయితే వేసింది. ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా వ‌చ్చినందుకు ఏమ‌నాలో కూడా అర్థం కావ‌ట్లేద‌ని.. ఒక‌వేళ నిజంగానే వికాస్ భెల్‌పై అంత సానుభూతి ఉన్న‌పుడు ఆమె ఎందుకు విడాకులు తీసుకుంద‌ని ప్ర‌శ్నించింది. మొత్తానికి రెండు కొప్పుల మ‌ధ్య స‌మ‌రం బాగా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ర‌చ్చ ఇంకెంత దూరం వెళ్ళ‌నుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: October 14, 2018, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading