హోమ్ /వార్తలు /సినిమా /

Kangana Hrithik: అత‌డి ఏడుపు క‌థ మ‌ళ్లీ మొద‌లైంది.. హృతిక్ రోష‌న్‌పై కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Kangana Hrithik: అత‌డి ఏడుపు క‌థ మ‌ళ్లీ మొద‌లైంది.. హృతిక్ రోష‌న్‌పై కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హృతిక్ రోష‌న్‌ కంగ‌నా ర‌నౌత్

హృతిక్ రోష‌న్‌ కంగ‌నా ర‌నౌత్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌(Hrithik Roshan)పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut). ఏడుపు క‌థ‌ను అత‌డు మ‌ళ్లీ స్టార్ట్ చేశాడ‌ని ఆమె కామెంట్లు చేశారు

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కంగ‌నా ర‌నౌత్. ఏడుపు క‌థ‌ను అత‌డు మ‌ళ్లీ స్టార్ట్ చేశాడ‌ని ఆమె కామెంట్లు చేశారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో కంగ‌నా ఓ పోస్ట్ చేశారు. ''అత‌డి ఏడుపు క‌థ మ‌ళ్లీ మొద‌లైంది. మా బ్రేక‌ప్ జ‌రిగి, విడాకులు జ‌రిగి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా అత‌డు ముందుకు సాగ‌లేక‌పోతున్నాడు. మ‌రో మ‌హిళ‌తో డేట్‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. నేనేదో ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకొని నా జీవితంలో సాగిపోతు ఉంటే అత‌డు మ‌ళ్లీ తన డ్రామాను ప్రారంభించారు. ఒక చిన్న అఫైర్ గురించి ఎంత దూరం వెళ‌తావు'' అని కంగ‌నా హృతిక్‌ని ట్యాగ్ చేశారు.

అయితే కంగ‌నా త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై 2016లో హృతిక్ కేసు న‌మోదు చేశారు. ఈ కేసును తాజాగా సైబ‌ర్ సెల్ క్రైమ్ ఇంట‌లిజెన్స్ యూనిట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఈ క్ర‌మంలో కంగ‌నా ఈ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే వీరిద్ద‌రి మ‌ధ్య వివాదానికి పెద్ద స్టోరీనే జ‌రిగింది. కంగ‌నాతో క్రిష్ 3లో క‌లిసి న‌టించారు హృతిక్. ఆ స‌మ‌యంలో తామిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ని, రిలేష‌న్‌లో ఉన్నామ‌ని.. హృతిక్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మాట కూడా ఇచ్చాడ‌ని కంగనా ఆరోప‌ణ‌లు చేశారు. వాటికి హృతిక్ గట్టి స‌మాధానాన్ని ఇచ్చారు.

అయినా ఈ ఇద్ద‌రి మ‌ధ్య మెయిల్ యుద్ధం జ‌ర‌గ్గా.. అప్ప‌ట్లో బాలీవుడ్‌లో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే కంగ‌నాపై హృతిక్ న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. కంగనాతో ఎలాంటి సంబంధం లేక‌పోయినా.. ఆమె మెయిల్ నుంచి వంద‌ల సంఖ్య‌లో మెయిళ్లు వ‌చ్చాయ‌ని 2016లో హృతిక్ సైబ‌ర్ సెల్‌లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

First published:

Tags: Bollywood, Hrithik Roshan, Kangana Ranaut

ఉత్తమ కథలు