HOME »NEWS »MOVIE »kangana ranaut slams eros for sharing abusive navaratri posts calls ott platforms a porn hub details here ms

Kangana Ranaut: ఓటీటీ అంటే పోర్న్ హబ్.. Erosnow పై విరుచుకుపడిన కంగనా రనౌత్

Kangana Ranaut: ఓటీటీ అంటే పోర్న్ హబ్.. Erosnow పై విరుచుకుపడిన కంగనా రనౌత్

గత కొన్నేళ్లుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ చేసిన పనికి తాను సిగ్గుపడుతున్నానని విమర్శించారు.

 • News18
 • Last Updated: October 22, 2020, 14:27 IST
 • Share this:
  ఈరోస్ వివాదంపై బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్ స్పందించారు. బాలీవుడ్ బామలు కత్రినా కైఫ్, కరీనా కపూర్ లతో పాటు మరో ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్వీర్ కపూర్ ల పోస్టర్ లతో ఈరోస్ నౌ విడుదల చేస్తున్న నవరాత్రి బొనాంజా పై సోషల్ మీడియాలో దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఓటీటీ ఫ్లాట్ ఫాం అనేది నీలి చిత్రాలకు అడ్డాగా మారిందని ఆమె కామెంట్ చేశారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోస్ విడుదల చేసిన ఫోటోలు, పోస్టులపై ఆమె విరుచుకుపడింది. ఈరోస్ చేసిన పనికి సిగ్గుపడుతున్నానని అన్నారు.

  ట్విట్టర్ లో #BoycottErosnow ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. నవరాత్రుల సందర్భంగా ఆ సంస్థ గత నాలుగు రోజులుగా చేస్తున్న పోస్టులు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం కత్రినా కైఫ్ ఫోటో ఆ ఆరోపణలకు ఆజ్యం పోసింది. దీంతో ఆ ఫోటోపై నెటిజన్లు చిందులు తొక్కుతున్నారు.


  తాజాగా ఇదే వివాదంపై కంగనా స్పందిస్తూ.. ‘సినిమా అనేది ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక బలమైన మాధ్యమం. దానిని మనం కాపాడుకోవాలి. ఆ అనుభవాన్ని పొందాలి. కానీ డిజిటలైజేషన్ వల్ల అది సాధ్యం కాదు. పెద్దస్థాయిలో ప్రేక్షకులను అది ఆకర్షించలేదు. ఓటీటీ అనేది పోర్న్ హబ్ లా మారింది. ఈరోస్ మీద సిగ్గుగా ఉంది’అని ట్వీట్ చేశారు.

  అంతేగాక ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కూడా బూతు ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయని ఆమె తెలిపారు. వీక్షకుల లైంగిక కోరికలను తీర్చేందుకు, హింసాత్మక కంటెంట్ ను ప్రోత్సహించేందుకే అవి ఉపయోగపడుతున్నాయని కామెంట్ చేశారు.

  erosnow, #BoycottErosnow, boycotteros, trending, trending on twitter, social media, navaratri
  Image credits : twitter/ erosnow


  కమ్యూనిటీ వీక్షణలలో మనం చూసేది ప్రపంచం చూస్తుందనే భయం ఉంటుందనీ, అంతేగాక దానికి సెన్సార్ షిప్ కూడా ఉంటుందని తెలిపింది. కానీ ఓటీటీ కి అవన్నీ ఏమీ లేవని.. అందుకే అందులో నేర పూరిత, లైంగిక కంటెంట్ ఎక్కువగా అమ్ముడవుతుందని ఆరోపించారు.
  Published by:Srinivas Munigala
  First published:October 22, 2020, 14:26 IST