బాలీవుడ్‌లో ఆలియాది జిహాది పాలిటిక్స్.. కంగనా సోదరి సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ అగ్ర నటి కంగనా రనౌత్.. ఆమె సోదరి రంగోలి చందెల్ తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై విరుచుకుపడ్డారు. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా సోదరి రంగోలి.. తాజాగా ఆలియా భట్‌పై విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: February 19, 2020, 8:50 AM IST
బాలీవుడ్‌లో ఆలియాది జిహాది పాలిటిక్స్.. కంగనా సోదరి సంచలన వ్యాఖ్యలు..
అలియా భట్ కంగన రనౌత్
  • Share this:
బాలీవుడ్ అగ్ర నటి కంగనా రనౌత్.. ఆమె సోదరి రంగోలి చందెల్ తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై విరుచుకుపడ్డారు. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా సోదరి రంగోలి.. తాజాగా ఆలియా భట్‌పై విరుచుకుపడ్డారు. తాజాగా ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో భాగంగా.. బెస్ట్ యాక్ట్రెస్  అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా. దీనిపై రంగోలి ఆలియాపై విరుచుకుపడింది. ‘గల్లీ‌బాయ్’ సినిమాలో ఆలియా భట్.. బుర్కా వేసుకునే యువతి పాత్రలో నటించింది. ఆమెకు ఈ అవార్డు ఇవ్వడానికి ఇది సరిపోయిందని రంగోలి వ్యాఖ్యానించింది. ఇది జిహాది పాలిటిక్స్ అంటూ విరుచుపడింది. ఆలియాకు వాళ్ల తల్లి తండ్రులు.. నటన నేర్పించలేదన్నారు. జిహాది పాలిటిల్స్‌లో శిక్షణ ఇప్పించారని.. అందుకే ఆమెకు ఈ అవార్డు వచ్చిందన్నారు. కంగనా విషయానికొస్తే.. ఈ యేడాది ఈమె నటించిన ‘పంగ’ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ‘తేజస్’ చిత్రంతో పాటు ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కనిపించనుంది. ఈ యేడాది కంగనాకు కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు