రీసెంట్గా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్..ఐశ్వర్యా రాయ్‌ను ఎగ్జిట్ పోల్స్‌తో పోలుస్తూ ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ట్వీట్ పై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే కదా. వివేక్ చేసిన ఈ ట్వీట్ పై సినీ ప్రముఖులు, జాతీయ మహిళ కమిషన్.. నెటిజన్లు ఆయన పై ఓ రేంజ్లో ధ్వజమెత్తడంతో..వివేక్ తను చేసిన పనికి క్షమాపణలు కోరుతూ ఆ ట్వీట్‌ను తొలిగించారు. తాజాగా జరిగిన ఈ ఘటనపై కంగనా సోదరి రంగోలి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మహిళ కమిషన్ ఈ విషయంలో ఓవర్‌గా స్పందించిందని ఓ రేంజ్లో ఫైర్ అయింది. అంతేకాదు మన దేశంలో ఉన్న మహిళ కమిషన్ ఓ ఫ్రాడ్ సంస్థ అంటూ ధ్వజమెత్తింది. అంతేకాదు మన దగ్గర స్త్రీ వాదం చనిపోవడానికి ఇలాంటి మహిళ కమిషన్లే కారణమంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారు ఎవరి ఇష్టారీతిన వారు హాయిగా తిరుగుతున్నారు.

ఐశ్వర్యరాయ్, వివేక్ ఒబెరాయ్
కానీ ఎవరో ఓ చెత్త జోక్ ను పోస్ట్ చేసినందకు మహిళ కమిషన్ ఓవర్‌గా స్పందిస్తోందన్నారు. అసలు ఆ జోక్‌ను అంతగా పట్టించుకోవాలా ? నా సోదరి కంగన.. ఓ స్టార్ హీరో పై కంప్లైట్ చేయడానికి వస్తే ఎవరు పట్టించుకోలేదు అంటూనే ఇన్ డైరెక్ట్‌గా హృతిక్ రోషన్‌పై విరుచుకుపడింది. ఆ సంఘటనను నేను ఇప్పటికీ మరిచిపోలేనన్నారు. ఇలాంటి మహిళా కమిషన్లు రేప్ చేసిన నిందితులను పట్టించుకోకుండా.. ఇలాంటి అర్ధం పర్ధం లేని జోకులపై పోరాడేందకు మాత్రం ముందుకొస్తుయన్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:May 21, 2019, 16:56 IST