దీపికా పదుకొనే పై కంగనా రనౌత్ సోదరి రంగోలి ఫైర్..

గత కొన్నేళ్లుగా హీరోయిన్ కంగనా రనౌత్ కంటే.. ఆమె సోదరి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు తన సోదరి కంగనాపై విమర్శలు చేసే వారందరికీ ఘాటుగా సమాధానం ఇస్తూ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది రంగోలి.తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మరో బాలీవుడ్ స్టార్ కథానాయిక దీపికా పదుకొనేపై ట్విటర్ వేదికగా విమర్శలు కురిపించింది.

news18-telugu
Updated: July 6, 2019, 12:53 PM IST
దీపికా పదుకొనే పై కంగనా రనౌత్ సోదరి రంగోలి ఫైర్..
దీపికా పదుకొణే పై ఫైర్ అయిన కంగనా సోదరి రంగోలి
  • Share this:
గత కొన్నేళ్లుగా హీరోయిన్ కంగనా రనౌత్ కంటే.. ఆమె సోదరి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు తన సోదరి కంగనాపై  విమర్శలు చేసే వారందరికీ ఘాటుగా సమాధానం ఇస్తూ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది రంగోలి.తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మరో బాలీవుడ్ స్టార్ కథానాయిక దీపికా పదుకొనేపై ట్విటర్ వేదికగా విమర్శలు కురిపించింది. వివరాలలోకి వెళితే.. ఇటీవల దీపికా పదుకొనే 2015 సంవత్సరంలో తాను విపరీతమైన డిప్రెషన్‌కు గురయ్యానని ఒక మీడియాతో జరిగిన ఇంటర్వ్యూ లో తెలిపింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఓదార్పు, వైద్యం తనను మామూలు మనిషిని చేశాయని చెప్పుకొచ్చింది . తనలాగే డిప్రెషన్‌తో బాధపడేవారి కోసం లీవ్ లవ్ లాఫ్ అనే సంస్థను స్థాపించి.. డిప్రెషన్ పట్ల అవగాహన కలిగిస్తు సేవ చేస్తునట్టు తెలిపింది దీపికా. అయితే ఈ ఇంటర్వ్యూ ను ఇప్పటివరకు యూట్యూబ్లో పది లక్షల మందికి పైగా వీక్షించారు, ఈ సందర్భంగా దీపిక, లీవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ చైర్ పర్సన్‌తో  కలిసి డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఆ సంస్థ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో పై కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా.. డిప్రెషన్ పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రంగోలి. మరి రంగోలి వ్యాఖ్యలపై దీపికా ఏ రకంగా సమాధానం ఇస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 6, 2019, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading