చిరంజీవి దర్శకుడు చేసిన పనికి ఫైర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ సోదరి..

అవును మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసిన ఈ బాలీవుడ్ దర్శకుడిపై ఈ బాలీవుడ్ హీరోయిన్ సిస్టర్ మండి పడుతోంది. వివరాల్లోకి వెళితే.

news18-telugu
Updated: December 19, 2019, 8:23 AM IST
చిరంజీవి దర్శకుడు చేసిన పనికి ఫైర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ సోదరి..
చిరంజీవి (Twitter/photo)
  • Share this:
అవును మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసిన ఈ బాలీవుడ్ దర్శకుడిపై కంగనా రనౌత్ సిస్టర్స్ మండి పడుతున్నారు. వీళ్లిద్దరు ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఏకిపారేస్తారో ఎవరు ఊహించలేరు. చిన్న లొసుగు దొరికితే చాలు.. నలిపి పారేస్తుంటారు. తాజాగా ఈ సిస్టర్స్ ఇద్దరు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సరవణ బిల్లును అపోజ్  చేస్తూ.. మహేష్ భట్ ఓ వీడియోను రిలీజ్ చేసాడు. ఆ వీడియోను ఉద్దేశిస్తూ.. కంగనా సోదరి రంగోలి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇక మహేస్ భట్ రిలీజ్ చేసిన వీడియోలో ‘మీలో ప్రేమ లేకపోతే ఎంత మంది దేవుళ్లను మొక్కినా.. సేవా కార్యక్రమాలు చేసినా.. పేదసాదలకు సాయం చేసినా.. రాజకీయాల్లో వచ్చినా.. పుస్తకాలు రాసినా.. ఇలా ఎన్ని చేసినా మీరు చనిపోయిన పాముతో సమానం. ప్రేమ లేకపోతే సమస్యలు ఎదురవుతూనే ఉంటాయని పౌరసత్వ సరవణ బిల్లును వ్యతిరేకిస్తూ మహేష్ భట్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీనిక కౌంటర్‌గా కంగనా సోదరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహేష్ గారు.. పుస్తకాలు చదవడం వల్ల చాలా విషయాలను తెలుసుకుంటాం కానీ...పెద్ద మనషులం అవ్వం. వయసొచ్చిన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ.. ఫోటో తీయించుకున్న మీరా మాకు నీతులు చెప్పేది. మనం చేసే మంచి పనులతో పెద్దరికం వస్తోంది. దేశం కోసం మీరేం చేశారు ? ఇలా ఏదో మేమే ఉత్తములం అంటూ నటిస్తే కుదరదూ అంటూ స్ట్రాంగ్‌గానే మాట్లాడుతూ.. మనం భారత మాతను రక్షించుకుందాం అంటూ రివర్స్‌లో కామెంట్ చేసింది చందేల్.

kangana ranaut sister rangoli chandel fire on mahesh bhatt here are the details,mahesh bhatt,kangana ranaut,chiranjeevi,nagarjuna,alia bhatt,rangoli chandel,kangana ranaut interview,mahesh bhatt fight with kangana ranaut,kangana ranaut insults alia bhatt,rangoli,kangana ranaut's sister rangoli,mahesh bhatt movies,mahesh bhatt interview,kangana ranaut on alia bhatt,kangana ranaut alia bhatt,kangana ranaut movies,kangana ranaut angry on alia bhatt,kangana ranaut and mahesh bhatt,bollywood,tollywood,telugu cinema,చిరంజీవి,మహేష్ భట్,కంగనా రనౌత్,కంగనా రనౌత్ చిరంజీవి,కంనగా సోదరి రంగోలి చందేల్,కంగనా రనౌత్
కంగనా సోదరి రంగోలి, మహేష్ భట్ (Twitter/Photos)


ఇక కంగనాకు మహేష్ భట్‌కు అంతగా పడదు. గతంలో ఓ సినిమా విషయంలో వీళ్లిద్దరి మధ్య పెద్ద రచ్చే నడిశింది. తాజాగా ఆస్కార్‌కు భారత తరుపున ‘గల్లీబాయ్’ సినిమా రిజెక్ట్ అయిన విషయం తెలిసిందే కదా. దీనిపై రంగోలి స్పందిస్తూ.. హాలీవుడ్‌లో హిట్టైన ‘8 మైల్’ సినిమాను కాపీ చేసి తెరకెక్కించిన సినిమాను హాలీవుడ్ వాళ్లు ఎందుకు అవార్డు ఇస్తారు అని ప్రశ్నించింది. మరోవైపు సొంత కంటెంట్‌తో తెరకెక్కించిన ‘ఉరి’, ‘మణికర్ణిక’ వంటి సినిమాలను ఆస్కార్‌కు పంపించి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడింది. మహేష్ భట్ విషయానికొస్తే.. గతంలో నాగార్జున హీరోగా ‘క్రిమినల్’, చిరంజీవి హీరోగా ‘ది జెంటిల్మెన్’ సినిమాను హిందీలో రీమేక్ చేసారు. వీటితో బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే కదా.


First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు