Kangana Ranaut - Mahatma Gandhi: గాంధీ అయితే ఏంటి...? మ‌గాడు కాబ‌ట్టే దేశం క్ష‌మించింది! కంగ‌న సంచలన వ్యాఖ్య‌లు!

Kangana Ranaut sensational comments on Mahatma Gandhi

Kangana Ranaut - Mahatma Gandhi: బాలీవుడ్ హీరోయిన్, దర్శకురాలు కంగనా రనౌత్, జాతిపిత మహాత్మా గాంధీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి దీనిపై ఇతరులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Share this:
    అత‌ను మంచి లీడ‌ర్ కావ‌చ్చు. కానీ మంచి భ‌ర్త కాడు. అయినా ఈ ప్ర‌పంచం అత‌న్ని క్ష‌మిస్తుంది. ఎందుకంటే అత‌ను ఒక మ‌గాడు కాబ‌ట్టి అంటూ మ‌హాత్మ గాంధి గురించి కంగ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. యావ‌న్మంది భార‌తీయులు ఇవాళ దేశం సాధించిన స్వాతంత్రం గురించి మాట్లాడుకున్నారు. తెలంగాణ‌లో కేసీఆర్‌, ఆంధ్ర‌లో జ‌గ‌న్ మాత్ర‌మే కాదు... సాక్షాత్తు దేశ ప్ర‌ధాని కూడా ఇవాళ అదే భావ‌న‌లోనే ఉన్నారు.

    కానీ కంగ‌న మాత్రం ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హాత్మా గాంధీలోని లోపాల‌ను ఎత్తి చూపించారు. ఆయ‌న గురించి ప‌లు సంద‌ర్భాల్లో రాసిన విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. త‌న పిల్ల‌ల‌కు అత‌ను మంచి తండ్రి కాలేక‌పోయార‌ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో రాశారు. అంతే కాదు, ప‌లు సంద‌ర్భాల్లో మ‌హాత్మా గాంధి గురించి రాసిన ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న త‌న స‌తీమ‌ణి ప‌ట్ల ఎలా దురుసుగా ప్ర‌వ‌ర్తించేవారో మాట్లాడారు. అతిథుల టాయ్‌లెట్ల‌ను శుభ్రం చేయ‌లేద‌ని త‌న భార్య‌ను ఆయ‌న ఎలా ఇంటి నుంచి గెంటేసేవారో చెప్పారు. ఇన్ని అవ‌ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తిని ఒక దేశం క్ష‌మించింద‌ని, అత‌ను భ‌ర్త‌గా క‌రెక్ట్ గా లేకున్న‌ప్ప‌టికీ మ‌గాడు కాబ‌ట్టే అలా క్ష‌మించ‌గ‌లిగింద‌ని అన్నారు.

    మ‌న‌సులో ఏం తోచినా గ‌ట్టిగా మాట్లాడ‌టం కంగ‌నకు అల‌వాటు. అయితే ఏకంగా జాతిపిత మీద ఆమె చేసిన వ్యాఖ్య‌లు మాత్రం గ‌ట్టి దుమారాన్నే రేపుతున్నాయి. ఆమె న‌టించిన త‌లైవి డ‌బ్బింగ్ ప‌నులు ఓ వైపు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఇంకో సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్పుడు గాంధి మీద చేసిన కామెంట్ల ప్ర‌భావం ఈ సినిమాల మీద ఎక్క‌డ ప‌డుతుందో అని మేక‌ర్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు.
    Published by:Anil
    First published: