తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తున్నారు. దీంతో పురచ్చి తలైవి పాత్ర కోసం ఇప్పటికే తమిళం నేర్చుకుంటున్న కంగనా.. పూర్తిగా జయలలితలా కనిపించేందుకు ప్రొస్తెటిక్ మేకప్ కోసం ఇటీవలే అమెరికా కూడా వెళ్లారు. 'మణికర్ణిక' లాంటీ హిస్టారికల్ మూవీ తర్వాత కంగనా రనౌత్ నటిస్తున్న బయోపిక్ ఇదే. దీంతో ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బగానే కష్టపడుతున్నారు. జయ లలిత వలే ఆమె కూడా భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. అంతేకాదు జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటోంది కంగన.
అది అలా ఉంటే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కోవై పట్టణానికి వచ్చిన కంగనా మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆమె జయలలిత గురించి మాట్లాడుతూ.. భారతదేశ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలిగా పేరుగడించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రలో నటించే అవకాశం తనను వరించడం అదృష్టంగా తెలిపారు. అయితే చిన్నవయసులోనే సినీరంగప్రవేశం చేసిన జయలలిత ఈ రంగంలో పురుషాధిక్యతను ఎదుర్కొని జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్నారని చెప్పారు. నేనుకూడా జయలలిత గారిలా సినీరంగంలో చాలా కష్టాలు ఎదుర్కున్నానని తెలిపారు. జయలలిత విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా చాలా శక్తిమంతమైన మహిళగా జీవించారని ఆమె ప్రశంసించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.