ఎందుకో తెలియదు కానీ బాలీవుడ్లో కంగన రనౌత్‌ను చూస్తుంటే ఏదో తెలియని నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎవ్వరినీ లెక్క చేయని తనం.. కావాలనే విమర్శించే గుణం ఆమెను మిగిలిన వాళ్ల నుంచి దూరం చేస్తుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఇలా ఎదురుగా ఎవరున్నారని కూడా చూసుకోకుండా ఇష్టమొచ్చినట్లు సెటైర్లు వేస్తుంది కంగన. దాంతో ఎంత టాలెంట్ ఉన్నా.. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్నా.. రియల్ లైఫ్ పరంగా మాత్రం ఉత్తమ కారెక్టర్ అనిపించుకోవడం లేదు కంగన రనౌత్. తాజాగా మరోసారి ఈమె వార్తల్లో నిలిచింది. అలియా భట్‌పై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడింది కంగన.

అలియా భట్ కంగన రనౌత్
ఈ ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వార్ నడుస్తుంది. కంగన ఓ మాట అంటే.. అలియా రెండు అంటుంది. అలియా రెండు అంటే కంగన మూడు అంటుంది. ఇప్పుడు కూడా ఇలాగే అలియాపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యే కంగనా నటించిన మణికర్ణిక.. అలియా నటించిన గల్లిబాయ్ విడుదలయ్యాయి. రెండూ పర్లేదు అనిపించాయి. ఇక ఈ రెండు సినిమాల మధ్య ఇప్పుడు అవార్డుల పోటీ నడుస్తుంది. దాంతో కంగన రనౌత్‌ను ఈ చిత్రాల మధ్య పోటీ గురించి అడిగారు మీడియా మిత్రులు.

అలియా భట్ కంగన రనౌత్
దాంతో రెచ్చిపోయిన కంగన.. గల్లీబాయ్ సినిమాలో అలియా చేసిన సఫీనా పాత్రలో ఏం కొత్తదనం ఉంది.. చాలా రొటీన్‌గా అనిపించింది నాకు.. అసలేం నచ్చలేదు అంటూ పెదవి విరించింది కంగన రనౌత్. ఇక అవార్డుల విషయంలో కూడా గల్లీబాయ్ లాంటి సినిమా తనకు పోటీ అవుతుందని ఎప్పుడూ అనుకోనని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేసింది కంగన. అసలు అలాంటి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడానికి మీడియా ఆపేయాలని కోరింది కంగన. అలాంటి సినిమాలను ఎందుకు ఎంపిక చేస్తున్నారు అంటూ ఫైర్ అయింది ఈ ముద్దుగుమ్మ.

కంగన రనౌత్ ఫైల్ ఫోటో
సాదాసీదాగా నటించే వాళ్లను తనతో పోల్చొద్దు.. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది అంటూ కోపంగా మాట్లాడేసింది కంగన. అయితే కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అలియా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. హైవే, రాజీ, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించిన అలియా నటనను తక్కువ చేయాల్సిన అవసరం లేదని.. పక్క వాళ్ల క్రిడిట్ ఎప్పుడూ అలియా కొట్టేయాలనుకోలేదని సెటైర్లు వేసారు. మరి ఈ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.