Kangana: బాలీవుడ్ కంటే టాలీవుడ్ తోపు అంటున్న కంగనా రనౌత్..

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే టాలీవుడ్ ఇండస్ట్రీ తోపు అంటూ వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: September 19, 2020, 10:01 PM IST
Kangana: బాలీవుడ్ కంటే టాలీవుడ్ తోపు అంటున్న కంగనా రనౌత్..
కంగనా రనౌత్ (File/Photo)
  • Share this:
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కంగనా తన సొంత హిమాలచ్ ప్రదేశ్‌కు వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ముంబైను పాక్రమిత కాశ్మీర్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలు సరైనవే అంటున్నారు. ఈ నేపథ్యంలో కంగనా అభినవ ఝాన్సీ రాణీ అంటూ ఆమెకు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొందరు కంగనా ఇంతే పబ్లిసిటీ కోసమే ఇంత రాద్దాంతం చేస్తున్నట్టు మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ.. దేశంలో ఉన్న హిందీ పరిశ్రమ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఇండస్ట్రీనే తోపు అంటూ వ్యాఖ్యానించింది. ఉత్తర ప్రదేశ్ యోగీ ఆదిత్య నాథ్ యూపీలోని నోయిడాలో ఫిల్మ్ సిటీని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలోని అందమైన ఫిల్మ్ సిటీని యూపీలో త్వరలో రాబోతుంది అంటూ వ్యాఖ్యానించారు.  ఈ నేపథ్యంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది.


తెలుగు సినిమాలు ఇపుడు ప్యాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి గుర్తు చేసింది. అంతేకాదు అనేక హిందీ సినిమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.  దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ భాషలకు చెందిన చిత్ర పరిశ్రమలను ఒక్కటిగా చేస్తే.. భారత దేశం ప్రపంచంలోని మొదటిస్థానానికి వస్తుందని కంగనా అభిప్రాయ పడ్డారు. ఇక కంగనా తెలుగులో ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 19, 2020, 10:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading