మీ నాన్న కారణంగా పోకిరి సినిమాను మిస్ అయ్యాను : ప్రభాస్ భామ..

Kangana Ranaut : సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి విమర్శలు వెల్లువెత్తున్నాయి.

news18-telugu
Updated: July 11, 2020, 2:34 PM IST
మీ నాన్న కారణంగా పోకిరి సినిమాను మిస్ అయ్యాను : ప్రభాస్ భామ..
కంగనా Photo : Instagram/team_kangana_ranaut
  • Share this:
సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ విషయంపై హీరోయిన్ కంగనా రనౌత్ పలుమార్లు విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా నెపోటిజంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. అందులో భాగంగా తన ఫస్ట్ సినిమా 'గ్యాంగ్ స్టర్' నిర్మాత మహేశ్ భట్ పై కంగన తీవ్ర విమర్శలు చేసింది. తండ్రిపై విమర్శలు చేయడంతో పూజా భట్ కూడా కంగనాపై ఫైర్ అయింది. అందులో భాగంగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో 'గ్యాంగ్ స్టర్' చిత్రానికి గాను 2006లో ఉత్తమ నూతన నటిగా ఆమె అవార్డు అందుకున్న కంగనా... ఆ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకడైన ముఖేశ్ భట్ తమ్ముడు మహేశ్ భట్ ను కంగన కౌగిలించుకుంది. అనంతరం అవార్డు తీసుకున్న తర్వాత చిత్ర యూనిట్ ను ప్రశంసించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని... అప్పుడు ప్రశంసించిన కంగన ఇప్పుడు విమర్శిస్తోందని ఆమెపై పూజాభట్ మండిపడింది. ఇక దీనిపై స్పందించిన కంగనా.. 'మీ నాన్న వల్ల నాకు పెద్ద నష్టమే జరిగింది. మీ 'గ్యాంగ్ స్టర్' సినిమా సమయంలోనే నేను తెలుగులో పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'పోకిరి'ని వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు పెద్ద నష్టాన్నే కలిగించిందని తెలిపింది.
Published by: Suresh Rachamalla
First published: July 11, 2020, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading