Home /News /movies /

KANGANA RANAUT MUMBAI METROPOLITAN COURT ISSUE ARREST WARRANT TO KANGANA RANAUT TA

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు కోర్టు అరెస్ట్ వారెంట్..

కంగనా రనౌత్ (Twitter/Photo)

కంగనా రనౌత్ (Twitter/Photo)

Kangana Ranaut: కంగనా రనౌత్ .. బాలీవుడ్ రెబల్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనాకు అలవాటు. తాజాగా ఈమెపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

    Kangana Ranaut: కంగనా రనౌత్ .. బాలీవుడ్ రెబల్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనాకు అలవాటు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీపై  ఓరేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె పై కక్ష్య కట్టి మరి ఆమె ఉంటున్న నివాసాన్ని కూల్చినా.. ఎక్కడ వెరవకుండా తనదైన శైలిలో దూసుకుపోతూనే ఉంది. ఐతే..  కంగనా పై ప్రముఖ బాలీవుడ్ సినీ, గేయ రచయత జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేసారు. కంగనా రనౌత్ ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం వెనక అనవసరంగా తన పేరును లాగారని ఆరోపిస్తూ జావేద్ అఖ్తర్ కంగనా రనౌత్ పై ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసారు. కంగనా పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేయాలని జావేద్ అక్తర్ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తమ ముందర హాజరు కావాలని కంగనాకు ఆదేశాలు జారీ చేసింది.

    ఐతే.. కంగనా కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముంబై మెట్రో పాలిటిన్ కోర్టు తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై కంగాన ముంబై హైకోర్టులో సవాల్ చేయనుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గతేడాది జూన్ 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Javed Akhtar, Kangana Ranaut

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు