news18-telugu
Updated: October 2, 2020, 6:58 PM IST
కంగనా రనౌత్ (File/Photo)
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. ఆ తర్వాత కంగనా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిపోయింది. రీసెంట్గా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కంటే టాలీవుడ్ చిత్ర పరిశ్రమనే గ్రేట్ అంటూ వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ భామ హైదరాబాద్‌లో లాండ్ అయింది. నిన్న మొన్నటి వరకు వివాదాలతో సహవాసం చేసిన కంగనా .. ఇపుడు వాటన్నింటినీ పక్కనపెట్టి షూటింగ్స్ పై శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ.. ‘తలైవి’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి విచ్చేసింది.

జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్ (thalaivi movie)
‘తలైవి’ చిత్ర విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమ్ హీరోయిన్ అయిన జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కంగనా.. జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం కంగనా కాస్తంత బరువు కూడా పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కంగనా రామోజీ ఫిల్మ్ సిటీలో 10 రోజుల పాటు షూటింగ్లో పాల్గొననుంది. ఐతే.. కంగనా హైదరాబాద్ వచ్చే విషయాన్ని అధికారులు సీక్రెట్‌గా ఉంటారు. ప్రస్తుతం కంగనాకు ప్రభుత్వ పరంగా ‘వై’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కరోనా తర్వాత దాదాపు 7 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత కంగనా తిరిగి షూటింగ్లో పాల్గొనడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 2, 2020, 6:58 PM IST