kangana love.. ప్రేమలో కంగనా.. ఇంతకీ ఆ హీరోనేనా ..

కంగన రనౌత్

ఒకవైపు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా రాణిస్తూనే..మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎపుడు ముందుంటుంది. తాజాగా ఈ భామ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. 

  • Share this:
ఒకవైపు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా రాణిస్తూనే..మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎపుడు ముందుంటుంది. తాజాగా ఈ భామ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.  బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. కొద్ది రోజుల క్రితం ‘మణికర్ణిక’ దర్శకత్వ క్రెడిట్ విషయంలో క్రిష్‌తో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై బాలీవుడ్‌లో పెద్ద రచ్చే నడిచింది. తాజాగా ఈ భామ తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. గతంలో ప్రేమ విషయంలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను ప్రేమలో లేని రోజంటూ లేదని వ్యాఖ్యానించింది. జీవితంలో ఎదురైన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం సహ జీవనం గురించి ఎలాంటి ఆలోచనలు లేవంటూ వ్యాఖ్యానించింది.

కొన్నేళ్ల క్రితం వరకు రిలేషన్స్ పట్ల ఎన్నో రకాల ఆలోచనలు ఉండేవి. కానీ ఇపుడే ఎవరి కోసం నేను పాకులాడం లేదంటూ చెప్పింది. ఐతే తాను ఎవరితో ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం చెప్పకుండా ప్రస్తుతానికి సస్పెన్స్‌లో పెట్టింది కంగనా రనౌత్. మరోవైపు నిర్మాత కమ్ దర్శకుడు కరణ్ జోహార్, హీరో హృతిక్ రోషన్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాళ్లు ఎంత ప్రయత్నించిన తన స్థానాన్ని మాత్రం అందుకోలేరంటూ చెప్పింది. ప్రస్తుతం ‘మణికర్ణిక’ ..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాతో మంచి జోష్‌లో ఉన్న ఈ భామ ప్రస్తుతం ప్రకాష్ కోవెలపూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కంగనా సరసన రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.
First published: