Kangana Ranaut Thalaivi: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ రెబల్ క్వీన్ కంగనా రనౌత్ నటించింది. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులో సినీ, రాజకీయాలు రెండింటితో సంబంధం ఉన్న జయలలిత జీవితంపై సినిమా అంటే సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ కోవలోనే ఒకప్పటి దక్షిణాది అగ్ర కథానాయక, రాజకీయ నాయకురాలు ముఖ్యమంత్రి అయిన సినీ నటి జయలలిత జీవితంపై పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ సినిమా తెరకెక్కింది.
ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. అంతేకాదు జయలలిత జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను ‘తలైవి’ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను బాలకృష్ణతో కలిసి ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను నిర్మించిన విష్ణు ఇందూరి భారీ ఎత్తున నిర్మించారు.
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
సెప్టెంబర్ 10న జయలలిత బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైపోయి కూడా ఏడాది అయిపోయింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు. యలలిత బయోపిక్ చేయడానికి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సినిమాలో ఎలాంటి వివాదాల లేకుండా నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు.
జయలలిత విషయానికొస్తే.. ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు క్లీన్ ’యూ’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమా నిడివి.. 153 నిమిషాల 22 సెకండ్లు.. అంటే 2 గంటల 33 నిమిషాల 22 సెకన్లు ఉంది.
'THALAIVII' CENSORED... 10 SEPT RELEASE... #Thalaivii [#Hindi] passed with 'U' certificate by #CBFC on 1 Sept 2021. Duration: 153 min, 22 sec [2 hours, 33 minutes, 22 seconds]. #India
Stars #KanganaRanaut and #ArvindSwami. In *cinemas* 10 Sept 2021 in #Hindi, #Tamil and #Telugu. pic.twitter.com/WCHoDyu8sW
— taran adarsh (@taran_adarsh) September 1, 2021
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో జయలలిత పాత్రలో కంగనా పరకాయ ప్రవేశం చేసిందా అనే రేంజ్లో విజృభించింది. ‘తలైవి’ విషయానికొస్తే.. ఈ సినిమాను విబ్రీ మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో లేనట్టుగా పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి.
ఇప్పటికే రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో ‘ది ఐరన్ లేడి’ అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. గౌతమ్ మీనన్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. మరోవైపు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతోంది. జయలలిత జీవితంపై కంగనా హీరోయిన్గా ‘తలైవి’ సినిమాను సెప్టెంబర్ 10న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind swamy, Bollywood news, Jayalalithaa Biopic, Kangana Ranaut, Kollywood, Thalaivi, Tollywood