Kangana Ranaut : పరువు నష్టం కేసులో ఈ రోజు కోర్టు ముందుకు కంగనా.. రాకపోతే అరెస్ట్ వారెంట్.. ?

కంగనా రనౌత్ (Twitter/Photo)

Kangana Ranaut : పరువు నష్టం కేసులో ఈ రోజు కోర్టు ముందుకు కంగనా (Kangana Ranaut).. రాకపోతే అరెస్ట్ వారెంట్.. జారీ కానుందా.. ? ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు..

  • Share this:
    Kangana Ranaut : పరువు నష్టం కేసులో ఈ రోజు కోర్టు ముందుకు కంగనా (Kangana Ranaut).. రాకపోతే అరెస్ట్ వారెంట్.. జారీ కానుందా.. ? ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.. వివరాల్లోకి వెళితే.. గత వారం సెప్టెంబర్ 14న పరువు నష్టం కేసులో కోర్డుకు గైర్హాజరైన సంగతి తెలిసిందే కదా. పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ . అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే కదా. అతేకాదు కంగాకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ  సందర్భంగా ఆమెను కోర్టు హాజరు నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తలైవి చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె పలువురిని కలవడంతో ఆమెకు కోవిడ్ సోకినట్టు తెలిపారు. 

    ఇప్పటికే జావేద్‌ అఖ్తర్‌కు సంబంధించి కేసులో కంగాన పలుమార్లు కోర్టుకు గైర్హాజరయ్యారు. సెప్టెంబర్ 24న ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జ్ ఈ కేసును ఈ రోజుకు వాయిదా వేసారు. ఒకవేళ ఈ రోజు కంగనా కోర్టుకు హాజరు కాకపోతే.. ఆమెపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశాలున్నాయి.

    ANR Birth Anniversary : అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఏఎన్నార్ అరుదైన చిత్రాలు..

    రచయిత జావేద్ అక్తర్ ఫిర్యాదు ఆధారంగా తనపై ప్రారంభించిన క్రిమినల్ పరువు నష్టం (Criminal defamation) కేసులను రద్దు చేయాలని కోరుతూ కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్‌ని బొంబాయి (Bombay High Court)హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలసిందే కదా.  జావేద్ అక్తర్ గత ఏడాది నవంబర్‌లో కంగనాపై పరువు నష్ట దావా వేశారు. కంగనా జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి ఇచ్చిన ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో అతనిపై  పరువు నష్టం కలిగించే నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జావేద్ అక్తర్ ఫిర్యాదు చేశారు.

    Love Story Pre Release Event : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదిరిన చిరు, సాయి పల్లవిల డాన్స్ మూమెంట్స్..

    ఇక ఆ తర్వాత డిసెంబర్ 2020 లో, కంగనా రనౌత్‌పై జావెద్ అక్తర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని కోర్టు జుహు పోలీసులను ఆదేశించింది, ఆపై ఆమెపై క్రిమినల్ చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు సమన్లు ​​జారీ చేసింది. ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటిస్తున్న తలైవి (Thalaivii)  ఈ నెల 10 న  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టాక్ బాగున్నా.. ఆ రేంజ్‌లో మాత్రం కలెక్షన్లను రాబట్టలేకపోయింది.  ఈ సినిమా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజకీయ నాయకులు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: