news18-telugu
Updated: November 26, 2020, 5:23 PM IST
కంగనా రనౌత్ (Twitter/Photo)
Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీ మీ జాగీరు కాదు.. అంటూ మరోసారి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై తనదైన శైలిలో మండిపడింది. కంగనా రనౌత్ విషయానికొస్తే.. బాలీవుడ్ రెబల్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనాకు అలవాటు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీపై ఓరేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె పై కక్ష్య కట్టి మరి ఆమె ఉంటున్న నివాసాన్ని కూల్చినా.. ఎక్కడ వెరవకుండా తనదైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా కంగాన మరోసారి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాతుకు పోయినా.. మాఫియాపై తనదైన శైలిలో స్పందించింది. ఈమె వ్యాఖ్యలు ఒక్కోసారి వివాదానికి దారి తీస్తుంటాయి.ఆ సంగతి పక్కనపెడితే.. కంగనా బాలీవుడ్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా మన దేశం తరుపున 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత దేశం తరుపున ఎంపికైన విషయం తెలిసిందే కదా. ఆ సందర్భంగా ‘జల్లికట్టు’ మూవీ యూనిట్‌ను కంగనా ప్రశంసిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. ఇదే సందర్భంంలో ఆమె బాలీవుడ్ చిత్ర ప్రముఖులపై విరుచుకుపడింది.

జల్లికట్టు మూవీ (Twitter/Photo)
ప్రతి ఒక్కరిపై అధికారం చేయాలనుకునే Bullywdawood గ్యాంగ్‌కు ఇది చెంపపెట్టు అని కంగనా వ్యాఖ్యానించింది. జల్లికట్టు అనే సినిమా ఆస్కార్‌కు మన దేశం తరుపున ఎంపిక కావడంతో చిత్ర పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు మాత్రమే చెందినదే విషయం దీనితో ప్రూవ్ అయింది. బాలీవుడ్ మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కొండి. ఎందుకుంటే జ్యూరీ తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తోందనే విషయం ‘జల్లికట్టు’ ఆస్కార్‌కు ఎంపిక కావడంతో ప్రూవ్ అయిందని చెప్పుకొచ్చింది.

జల్లికట్టు మూవీ (File/Photo)
ఈ సారి మన దేశం తరుపున ఆస్కార్ బరిలో విద్యా బాలన్.. ‘శకుంతలా దేవి’, గుంజన్ సక్సెేనా’, తో పాటు ‘ఛపాక్’‘గులాబో సితాబో’, ‘చెక్ పోస్ట్’, ‘స్కై ఈజ్ పింక్’, వంటి 27 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ మెంబర్స్ చివరగా.. మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ చిత్రాన్ని ఎంపిక చేసారు. మనుషుల్లో దాగున్న క్రూరత్వం.. జంతువుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న మానవులు తీరును ఈ సినిమాలో సూటిగా సుతి మెత్తగా చెప్పారు. ఈ చిత్రాన్ని లిజో జోస్ పెలిస్సెరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. జల్లికట్టు సినిమా విషయానికి వస్తే.. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న ఓ దున్నపోతు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతటి వినాశనం చేసిందనేది కథ. ఇక్కడ ఈ సినిమాలో విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ సినిమా మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఎక్కడా ఉపయోగించలేదట.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 26, 2020, 5:23 PM IST