కంగనా-కరణ్ మధ్య వివాదం ముగిసినట్లేనా?

బద్ధ శత్రువులుగా మారిన బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహార్, కంగనా రనౌత్ ఇద్దరూ పద్మశ్రీ అవార్డులు సాధించారు. తనతో పాటు పద్మశ్రీ గౌరవాన్ని దక్కించుకున్న కరణ్ జోహార్‌పై ప్రశంసల జల్లుకురిపించారు కంగనా.

news18-telugu
Updated: January 28, 2020, 8:41 AM IST
కంగనా-కరణ్ మధ్య వివాదం ముగిసినట్లేనా?
కరణ్ జోహార్, కంగనా రనౌత్
  • Share this:
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నటి కంగనా రనౌత్ మధ్య బేదాభిప్రాయాలు నెలకొనడం అందరికీ తెలిసిందే. నెపోటిజంకు ఆధ్యులంటూ ‘కాఫీ విత్ కరణ్’ షోలో కరణ్ జోహార్‌ను ఉద్దేశించి కంగనా వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తండ్రి వారసత్వంగా కరణ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కరణ్ జోహార్‌పై కంగనా తన నోటి దురుసును ప్రదర్శించింది. తానేమీ తక్కువ తినలేదంటూ...కంగనా ఎంచుకుంటున్న పాత్రలపై కరణ్ బహిరంగ విమర్శలు చేశాడు. మహిళా కార్డు వాడుకుంటోందని, బాధితురాలి పాత్రలనే కంగనా ఎంచుకుంటోందని కరణ్ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది.

తాజా పరిణామాల నేపథ్యంలో కరణ్ జోహార్‌తో విభేదాలకు ముగింపు పలకాలని కంగనా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొన్న కేంద్రం ప్రకటించిన పద్మ శ్రీ అవార్డుల జాబితాలో వీరిద్దరితో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఏక్తా కపూర్, అద్నాన్ సమీ చోటు దక్కించుకోవడం తెలిసిందే. తనతో పాటు పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న కరణ్ జోహార్‌కు కంగనా రనౌత్ కంగ్రాట్స్ చెప్పింది. పద్మశ్రీ అవార్డుకు కరణ్ అన్ని విధాలుగా అర్హులంటూ ప్రశంసల జల్లుకురిపించింది.

కంగనా రనౌత్(ఫైల్ ఫోటో)


అంతటితో ఆగకుండా కరణ్ నిర్మాణంలో వైవిధ్యభరితమైన చిత్రాలు వచ్చాయని కంగనా కితాబిచ్చింది. తన తండ్రి ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించినా...తన సొంత ట్యాలెంట్‌తో కరణ్ పైకి ఎదిగారంటూ అభినందించింది కంగనా. కంగనా తాజా వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య చాలాకాలంగా నెలకొన్న వివాదం ముగిసినట్లేనని బాలీవుడ్ మీడియా చర్చించుకుంటోంది.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు