హోమ్ /వార్తలు /సినిమా /

కరోనా పై పోరాటంలో కంగనా రనౌత్ తన వంతు సాయం..

కరోనా పై పోరాటంలో కంగనా రనౌత్ తన వంతు సాయం..

కంగనా రనౌత్ (Kangana Ranaut/Instagram)

కంగనా రనౌత్ (Kangana Ranaut/Instagram)

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్ని కరోనా పై పోరాడుతున్నాయి. కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా మన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇందులో భాగంగా ప్రముఖ నటి కంగనా తన వంతు ఆర్ధిక సాయం ప్రకటించింది.

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్ని కరోనా పై పోరాడుతున్నాయి. కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా మన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ లాక్‌డౌన్  కారణంగా చాలా మంది రోజు వారి కూలీలకు పనిలేకుండా పోయింది. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు తమ వంతు సాయం చేస్తున్నాయి. కరోనా పై పోరాటంలో సినీ నటులు కూడా తమ వంతు భాగస్వామ్యం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటీనటులు తమ వంతు విరాళాలు ప్రకటించారు. తాజాగా కంగనా కరోనాపై వ్యతిరేక పోరాటంలో తవ వంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్టు ఆమె సోదరి రంగోళి తెలిపింది. కంగనా రనౌత్ తల్లి ఆశా తన నెల పెన్షన్‌ను ప్రధాన మంత్రి సహాయ నిధికి అంజేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ కూడా వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు రూ. 51 లక్షల ఆర్ధిక సాయాన్నిప్రకటించారు. పదిహేను వేల మందికి సినీ వర్కర్స్‌కు యశ్ రాజ్ ఫిల్మ్ సంస్ధ ఆర్ధిక సహాయాన్ని అందజేయడానికి  ముందుకొచ్చింది.మరోవైపు సైఫ్, కరీనా కపూర్ దంపతులు కూడా ప్రధానమంత్రి సహాయ నిధితో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళాన్ని అందజేసారు. ఎంతన్నది తెలియజేయలేదు. మరోవైపు కరీనా సోదరి కరిష్మా కపూర్ కూడా పీఎం కేర్స్‌కు విరాళాన్ని అందజేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు అండగా ఉండాలని ఎవరికి తోచినంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి కరోనా వ్యతిరేక పోరాటంలో ఎవరికి వారు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

First published:

Tags: Ajay Devgn, Bollywood, Coronavirus, Covid-19, Kangana Ranaut, Kareena Kapoor

ఉత్తమ కథలు