కంగనా ధాకడ్ ఫస్ట్ లుక్ టీజర్... ఇస్మార్ట్ శంకర్ తాతలా ఉందిగా...

Kangana Ranaut  | Dhaakad Teaser : కంగనా రనౌత్.. తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ భామ తాజా సినిమా 'ధాకడ్' ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో కంగనా.. సూపర్ మాస్ లుక్‌లో అదరగొట్టింది.

news18-telugu
Updated: August 10, 2019, 3:19 PM IST
కంగనా ధాకడ్ ఫస్ట్ లుక్ టీజర్... ఇస్మార్ట్ శంకర్ తాతలా ఉందిగా...
Photo : Instagram
  • Share this:
Kangana Ranaut  | Dhaakad Teaser : కంగనా రనౌత్.. తెలుగులో ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్, సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరీ జగన్నథ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత కంగనా తెలుగులో కనిపించలేదు. అయితే హిందీలో మాత్రం ఈ భామ తన సినిమాలతో అదరగొడుతూనే ఉంది. ఈ మధ్యనే కంగనా నటించిన 'జడ్జిమెంటల్ హైక్యా' సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించింది.  'జడ్జిమెంటల్ హైక్యా' సినిమాకు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఇప్పుడు కంగనా తన తదుపరి సినిమా  'ధాకడ్'  కోసం తన అవతారాన్ని పూర్తిగా మార్చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తాజాగా విడుదలైంది.

ఈ టీజర్‌లో కంగనా.. ఓ గన్ పట్టుకుని లేడీ డాన్ అదరగొట్టింది. టీజర్‌లో కంగనా మెషీన్ గన్‌తో కాల్పులు జరుపుతూ.. తన మీద పడిన నెత్తుటి మరకలను.. ఆమె తన నాలుకతో తుడుచుకునే సన్నివేశం జుగుప్స కలిగిస్తోంది. ఈ సినిమా పూర్తిగా మాస్‌ ప్రేక్షకుల్నీ  టార్గెట్ చేసి  తీసినట్లు ఈ టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ధాకడ్ వచ్చే ఏడాది దీపావళికి  విడుదల కాబోతోంది.First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు