Kangana Ranaut : పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన కంగనా.. సెప్టెంబర్ 20కు కేసు వాయిదా..

కంగనా రనౌత్ (Twitter/Photo)

Kangana Ranaut : పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ (Kangana Ranaut). అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు.

 • Share this:
  Kangana Ranaut : పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ (Kangana Ranaut). అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు. ఆమెకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడంతో పాటు ఆమె మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెను కోర్టు హాజరు నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘తలైవి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలువురిని కలిసినట్టు ఆమె తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు.  ఈ సందర్భంగా ఆమె అనారోగ్యానికి గురైనట్టు చెప్పారు. అందుకే కోర్టు హాజరు నుంచి ఓ వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని  కంగనా తరుపు లాయర్ కోర్టుకు తెలియజేసారు. ఆమెకు కోవిడ్ పరీక్ష చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆమె రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్నట్టు తెలిపారు.

  మరోవైపు జావేద్ అఖ్తర్  (Javed Akhtar) తరుపున లాయర్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్‌కు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చిన ఆమె కోర్టుకు గైర్హాజరువుతూనే ఉన్నారు. కావాలనే ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కంగనా పై పరువు నష్టం కేసు దాఖలు చేసిన జావేద్ అఖ్తర్ కోర్టుకు హాజరువుతూనే ఉన్నారు. ఈ కేసులో కంగనాకు ఏ కోర్టులో ఊరట లభించ లేదు. ఇప్పటికే ఆమెకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. కోర్టుకు వచ్చే తీరిక మాత్రం కంగనాకు కలగలేదా అంటూ ఆమె తీరును  జావేద్ అఖ్తర్ లాయర్ ఎండగట్టారు.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  కంగనాకు అసలు  న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జ్ ఈకేసును సెప్టెంబర్ 20కు వాయిదా వేసారు. ఒకవేళ ఆ రోజు కూడా కంగనాకు కోర్టకు హాజరు కాకపోతే.. ఆమెపై కోర్టు ధిక్కరణ కేసు కింద ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు.  ఈ విచారణలో భాగంగా కోర్టుకు  జావేద్ అఖ్తర్ తన సతీమణి షబానా అజ్మీతో కలిసి వచ్చారు.

  NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

  తరచయిత జావేద్ అక్తర్ ఫిర్యాదు ఆధారంగా తనపై ప్రారంభించిన క్రిమినల్ పరువు నష్టం (Criminal defamation) కేసులను రద్దు చేయాలని కోరుతూ కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్‌ని బొంబాయి (Bombay High Court)హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలసిందే కదా.  జావేద్ అక్తర్ గత ఏడాది నవంబర్‌లో కంగనాపై పరువు నష్ట దావా వేశారు. కంగనా జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి ఇచ్చిన ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో అతనిపై  పరువు నష్టం కలిగించే నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జావేద్ అక్తర్ ఫిర్యాదు చేశారు .

  Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

  ఇక ఆ తర్వాత డిసెంబర్ 2020 లో, కంగనా రనౌత్‌పై జావెద్ అక్తర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని కోర్టు జుహు పోలీసులను ఆదేశించింది, ఆపై ఆమెపై క్రిమినల్ చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు సమన్లు ​​జారీ చేసింది. ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటిస్తున్న తలైవి (Thalaivii)  ఈ నెల 10 న  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టాక్ బాగున్నా.. ఆ రేంజ్‌లో మాత్రం కలెక్షన్లను రాబట్టలేకపోయింది.  ఈ సినిమా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజకీయ నాయకులు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: