• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KANGANA RANAUT CLAIMS SHE IS THE BETTER AT STUNTS THAN TOM CRUISE AND BETTER ACTOR THAN MERYL STREEP AND NETIZENS TROLLS HER SR

Kangana Ranaut : నన్ను మించిన నటి ఈ భూమిపై లేదు - కంగనా రనౌత్ : ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Kangana Ranaut : నన్ను మించిన నటి ఈ భూమిపై లేదు - కంగనా రనౌత్ : ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Kangana Ranaut Photo: Instagram

Kangana Ranaut : కంగనా రనౌత్.. సినిమాల్లో కన్నా ట్విట్టర్‌లో కొన్ని వర్గాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అవుతోంది.

  • Share this:
    Kangana Ranaut : కంగనా రనౌత్.. సినిమాల్లో కన్నా ట్విట్టర్‌లో కొన్ని వర్గాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అవుతోంది. కంగనా హీరోయిన్‌గా తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. అది అలా ఉంటే ఇటీవల కంగనా సినిమాల గురించి మాట్లాడడం తగ్గించేసి.. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పాలిటిక్స్ గురించి తన సోషల్ మీడియాలో రాస్తూ.. సమాజంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి తన అభిప్రాయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తోంది. ఢిల్లీ సమీపంలో జరుగుతున్న రైతుల ఉద్యమం గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా.. తాజాగా తన నటన, సినిమాల గురించి మాట్లాడుతూ మరో ఇంట్రెస్టింట్ ట్వీట్ చేసింది.

    ఈ సందర్భంగా ఆమె తన ట్వీట్‌లో రాస్తూ.. హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, యాక్షన్ స్టార్ టామ్ క్రూస్ కంటే తాను గొప్పగా స్టంట్లు చేయగలనని కంగ‌న ర‌నౌత్ చెప్పింది. తన కొత్త సినిమాలు తలైవి, థాకడ్ ల గురించి ప్రస్తావిస్తూ ఆ సినిమాలకు చెందిన కొన్ని పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఇలా రాసుకుంది.






    త‌న స్థాయిలో నటించగలిగే మరో నటి ప్రస్తుతం ఈ భూమి మీద లేదని ఆమె పేర్కోంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అద్భుతంగా పోషించే హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్‌లో ఉండే యాక్టింగ్ టాలెంట్ త‌నలో ఉందని చెప్పుకుంది. ఈ సందర్భంగా మరో హాలీవుడ్ నటి ఇజ్రాయిల్‌‌కు చెందిన గాల్ గాడేట్‌‌ను గుర్తు చేస్తూ.. తాను ఆమెలా యాక్షన్‌ కూడా చేయగలనని తెలిపింది. దీనికి సంబంధించి కొన్ని పిక్స్‌ను షేర్ చేసిన కంగనా.. తాను గ్లామర్ పాత్రల్లో నటించగలను.. అదే విధంగా భిన్న పాత్రలను పోషించగలను అన్నట్లు ట్వీట్ చేసింది. మరో ట్వీట్‌లో ఆమె హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ‌తో పోల్చుకుంది. ఇక ట్వీట్ చూసిన నెటిజన్స్.. రకరకాల మీమ్స్‌ తయారు చేసి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరూ ఆమె నటనపట్ల సెటైర్లు వేస్తున్నారు.






    అయితే ఈ ట్రోల్స్‌పై స్పందించిన కంగనా మరో ట్వీట్ చేసింది. అందరూ తనను ఎన్ని ఆస్కార్‌లు సాధించావంటూ అడుగుతున్నార‌ని, వారికి నేను ఒకటే చెప్ప‌గ‌ల‌న‌ని తెలిపింది. ఈ సందర్భంగా కంగనా.. మెరిల్ స్ట్రీప్ గురించి మాట్లాడుతూ.. ఆమె ఎన్ని జాతీయ అవార్డులు సాధించిందని తిరిగి ప్రశ్నించింది. బానిస మనస్తత్వం నుంచి బయటపడి.. ఆత్మ గౌరవంతో మెల‌గాల‌ని పేర్కోంది కంగనా..



    ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. కంగనా రనౌత్.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. ఈ సినిమాను ఏ ఎల్‌ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కంగనా హిందీలో ‘తేజస్’, ’ధాకడ్’ అనే మరో రెండు సినిమాలను చేస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు