Home /News /movies /

KANGANA RANAUT BLAMES DIVORCE EXPERT AAMIR KHAN FOR SAMANTHA AKKINENI NAGA CHAITANYA SEPARATION MKS

Chaysam divorce: బాంబు పేల్చిన కంగన -మిస్టర్ పర్ఫెక్ట్ వల్లే నాశనం -బట్టల్లా మార్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా?

చైసామ్ పై కంగనా

చైసామ్ పై కంగనా

Kangana on Chaysam divorce | పదేళ్ల ప్రేమ బంధం, నాలుగేళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రముఖ నటులు నాగ చైతన్య, సమంత అధికారికంగా ప్రకటించడం, గడిచిన కొద్ది గంటలుగా ChaySam divorce తో ముడిపడిన అంశాలపై విపరీతంగా చర్చ జరుగుతుండటం తెలిసిందే. విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలు, తప్పొప్పులపై ఎవరివారే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బాలీవుడ్ క్వీన్, తాజాగా తలైవీగానూ మెప్పించిన నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వేటగాడు, విడాకుల మోసగాడు, నాశనం చేశాడు.. లాంటి పదునైన పదాలతో తప్పు ఎవరిదో తేల్చేసిందిలా..

ఇంకా చదవండి ...
పదేళ్ల ప్రేమ బంధం, నాలుగేళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రముఖ నటులు నాగ చైతన్య, సమంత అధికారికంగా ప్రకటించడం, గడిచిన కొద్ది గంటలుగా ChaySam divorce తో ముడిపడిన అంశాలపై విపరీతంగా చర్చ జరుగుతుండటం తెలిసిందే. విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలు, తప్పొప్పులపై ఎవరివారే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బాలీవుడ్ క్వీన్, తాజాగా తలైవీగానూ మెప్పించిన నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వేటగాడు, విడాకుల మోసగాడు, నాశనం చేశాడు.. లాంటి పదునైన పదాలతో తప్పు ఎవరిదో తేల్చేసిందిలా..

కేవలం వినోదాత్మక లేదా సినిమా సంబంధిత అంశంగా మాత్రమే కాకుండా.. కులాంతర, మతాంతర వివాహం కారణంగానూ నాగ చైతన్య, సమంత బంధం తొలి నుంచీ హెడ్ లైన్స్ లో ఉంటూ వస్తోంది. పెళ్లి తర్వాత సమంత వ్యవహరించిన తీరుపైనా స్త్రీస్వేచ్ఛ కోణంలో రకరకాల విశ్లేషణలు వచ్చాయి. తాజాగా వారి విడాకుల ప్రకటనపైనా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. సంప్రదాయాలకు నెలవైన భారత్ లో విడాకుల సంస్కృతి పెరుగుతోండటంపైనా కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. సౌత్ స్టార్లయిన సమంత-చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు విడిపోవడంలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుపొందిన విడాకుల నిపుణుడి ప్రమేయం ఉందని బాంబు పేల్చింది. ఈ మేరకు కంగన ఆదివారం తన ఇన్ట్సాలో షాకింగ్ పోస్టులు పెట్టారు..

ఆకతాయి అభిమానులు..
కలిసి ఉండలేని పరిస్థితుల్లో భార్యాభర్తలుగా విడిపోతున్నామన్న నాగ చైతన్య, సమంతలు రాబోయే కాలంలో తాము స్నేహితులుగా కొనసాగుతామని చెప్పడాన్ని కంగన తీవ్రంగా తప్పు పట్టారు. ఒంటిపై దుస్తుల్ని మార్చినంత తేలికగా ఆడవాళ్లను మార్చేస్తూ, విడిపోయినా బెస్ట్ ఫ్రెండ్స్ లా కలిసుంటామని చెప్పుకోవడాన్ని ఆకతాయితనంగా కంగన అభివర్ణించారు. వెర్రి అభిమానులు, మీడియా నుంచి లభించిన ప్రోత్సాహంతో సిగ్గు తప్పిన ఆకతాయిలు విడాకులు తీసుకోవడం, వారు పరస్పరం అభినందనలు చెప్పుకోవడం చెత్తగా ఉందని, అదే సమయంలో మహిళదే తప్పని తీర్పులు చెప్పడమేంటని కంగన ప్రశ్నించారు. దేశంలో మునుపెన్నడూ లేనంతగా విడాకుల సంస్కృతి పెరుగుతోందన్నారు. అంతేకాదు,

ఏ జంట విడాకులు తీసుకున్నా, అందులో తప్పు ముమ్మాటికీ మగవాడిదే. వినడానికి ఈ స్టేట్మెంట్ తీర్పులా అనిపించినా, ఇదే పరమ నిజం. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషుల్ని అలాగే సృష్టించాడు. ఆది నుంచీ, శాస్త్రీయంగా మగాడు వేటగాడిగా, మహిళ పెంపకందారుగా ఉంటున్నారు. ఆడవాళ్లను బట్టల్లా మార్చేసి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే ఆకతాయిల పట్ల జాలి చూపించడం మానేయండి’అని కంగనా రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా చైసామ్ విడిపోవడంలో ప్రధాన పాత్రధారి అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పై కంగన తీవ్ర ఆరోపణలు చేశారు..


అతని వల్ల జీవితాలు నాశనం..
చాలా గ్యాప్ తర్వాత ఆమిర్ ఖాన్ చేస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తుండటం, షూటింగ్ సమయంలో తాము మంచి మిత్రులయ్యామని ‘లవ్ స్టోరీ’ వేడుకలో ఆ ఇద్దరూ చెప్పుకోవడం తెలిసిందే. ఆమిర్ ప్రభావంతోనే చైతూ సమంత విషయంలో సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని కంగన ఆరోపించారు. చైతన్య, ఆమిర్ పేర్లు ప్రస్తావించకుండా.. ‘ఈ దక్షినాది నటుడు అకస్మాత్తుగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. పదేళ్లుగా ఆమెతో కలిసుంటూ, నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఓ బాలీవుడ్ ప్రముఖుడితో ఆ సౌత్ స్టార్(చైతు) కలిసి పనిచేయడం చూశాం. విడాకుల నిపుణుడుగా పిలవబడే ఆ బాలీవుడ్ సూపర్ స్టార్.. చాలా మంది మహిళలు, పిల్లల జీవితాలను నాశనం చేశాడు. అతని మార్గదర్శనంలోనే తాజా విడాకుల ఉదంతం సజావుగా సాగింది. ఇదంతా నేను గుడ్డిగా చెప్పడం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలిసే ఉంటుంది..’అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు.
Published by:Madhu Kota
First published:

Tags: Aamir Khan, Kangana Ranaut, Naga chaitanaya, Samantha, Samantha akkineni

తదుపరి వార్తలు