Ranveer Singh-Kangana Ranaut : రణ్‌వీర్ సింగ్ రణబీర్ కపూర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి : కంగనా

Kangana Ranaut : బాలీవుడ్‌‌లో నెపోటిజం, నియంత పోకడలపై ఒంటరిపోరాటం చేస్తోన్న కంగనా రనౌత్ మరో బాంబ్ పేల్చింది.

news18-telugu
Updated: September 3, 2020, 1:15 PM IST
Ranveer Singh-Kangana Ranaut : రణ్‌వీర్ సింగ్ రణబీర్ కపూర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి : కంగనా
కంగనా, రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్ Photo : Twitter
  • Share this:
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై కంగనారనౌత్ బాలీవుడ్ ప్రముఖులపై ఇప్పటికే అనేక ఆరోపణలు చేసింది. ప్రస్తుతం సుశాంత్ కేసులో డ్రగ్ బాంబ్ పేలింది. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తికి డ్రగ్ సప్లైయర్స్‌తో సంబందాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో 99 శాతం డ్రగ్స్ తీనుకుంటారని బాంబ్ పేల్చింది. ఆ మాటలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చలకు దారితీసాయి. అది అలా ఉంటే ఇప్పుడు మరోసారి కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది కంగనా. బాలీవుడ్ లో స్టార్ హీరోలయిన రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ విక్కీ కౌశల్‌లు డ్రగ్స్ కు బానిసలయ్యారు.. అనే ఆరోపణలు ఉన్నాయని వారు డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిని ఆరాధించే లక్షలాది అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ట్విట్టర్ ద్వారా ఆమె కోరింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.



అయితే ఆమె వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఆమె మాటలకు కొందరు ఫుల్ గా సపోర్ట్ చేస్తుంటే.. కొందరూ మాత్రం బాలీవుడ్ లోని అందరికీ డ్రగ్స్ ఆపాదించడం అన్యాయమంటున్నారు.
Published by: Suresh Rachamalla
First published: September 3, 2020, 12:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading