KANGANA RANAUT ASKED TO QUESTION TO SONIA GANDHI ABOUT MAHARASHTRA SHIV SENA SARKAR ISSUE TA
kangana: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన కంగనా..
సోనియా గాంధీకి కంగనా ఘాటు ట్వీట్ (Twitter/Photo)
kangana Vs Sonia Gandhi | బాలీవుడ్ క్వీన్ కంనగా రనౌత్, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా కంగనా రనౌత్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ చేసింది.
బాలీవుడ్ క్వీన్ కంనగా రనౌత్, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో ముంబాయి పోలీసుల తీరును ఎండగట్టింది. ముంబై మహా నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కంగనాకు మహారాష్ట్రలోని అధికార పార్టీకి మధ్య దూరం పెరిగింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక్కడు సినిమాలో చూపించినట్టు కక్ష కట్టినట్టుగా కంగనా ఆఫీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ బీఎంసీ అధికారులు కూల్చే ప్రయత్నం చేసారు. దీంతో బాంబే హైకోర్టు హైకోర్డు ముంబై మున్సిపల్ కంగనా ఆఫీసును కూల్చొదంటూ స్టే విధించిన సంగతి తెలిసిందే కదా. మహారాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకే కంగనా పై వారు పగపట్టినట్టు అందరు చెప్పుకుంటున్నారు. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి విశాల్.. కంగనా చూపించిన తెగువను మెచ్చుకున్నారు.
You have grown up in the west and lived here in India. You may be aware of the struggles of women. History will judge your silence and indifference when your own Government is harassing women and ensuring a total mockery of law and order. I hope you will intervene 🙏@INCIndia
ఇంత జరిగాక కూడా కంగాన.. మహారాష్ట్ర సర్కారుతో తాడో పేడో తేల్చుకునే పనిలో పడింది. ఈ సందర్భంగా కంగనా రనౌత్.. కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ.. ఘాటుగా ట్వీట్ చేసింది.
సోనియా గాంధీకి కంగనా ఘాటు ట్వీట్ (Twitter/Photo)
ప్రియమైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీగారు.. ఓ మహిళగా ఉండి మీ ప్రభుత్వం సాటి మహిళను పెడుతున్న ఇబ్బందులను చూసి మీ మనసు చలించడం లేదా ? రాజ్యాంగ నిర్మాత భారత రత్న అంబేద్కరర్ గారు రాసిన రాజ్యాంగ సూత్రాలను పాటించాలని మీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ఎందుకు చెప్పడం లేదంటూ కాస్తా ఘాటుగానే స్పందిచింది. ఎక్కడో విదేశాల్లో పెరిగిన మీరు ప్రస్తుతం భారత దేశంలో నివసిస్తున్నారు. ఇంత జరగుతున్న మీ మౌనం చూస్తుంటే ధృతరాష్ట్రున్ని గుర్తుకు తెస్తుందన్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించినందకే.. మహా సర్కారు తనపై కత్తి కట్టి మరి ఓ మహిళనైనా నన్ను ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇక శివసేన వ్యవస్థాపకులు బాల్ సాహెబ్ థాక్రే అంటే తనకెంతో ఇష్టమైన రాజకీయ నేత. బ్రతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని అవలంభించిన ఆయన పార్టీ ఇపుడు అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిందన్నారు. ఈ విషయం తెలిసి బాల్ థాక్రే ఆత్మ ఘోషిస్తూ ఉంటుందంటూ వ్యాఖ్యానించి.. ఓ వైపు శివసేనను ... మరోవైపు కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా తూర్పారా పట్టింది కంగనా.