news18-telugu
Updated: January 14, 2021, 10:20 PM IST
Kangana Ranaut adventure once again historical role will workout
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి సాహసం చేయబోతుందా? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ సినీ వర్గాల నుంచి. ఇంతకీ కంగనా రనౌత్ చేయబోతున్న సాహసం ఏంటో తెలుసుకోవాలనుందా? అసలు విషయంలోకి వచ్చేద్దాం. 2019లో కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషించిన చిత్రం ‘మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ‘మణికర్ణిక.. ది లెజెండ్ ఆఫ్ దిద్దా’గా రూపొందనుంది. ‘మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రాన్ని నిర్మించిన కమల్ జైన్ సీక్వెల్‌ను కూడా నిర్మించబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.
ఈ సీక్వెల్లో యోధురాలైన కాశ్మీరీ రాణి దిద్దా పాత్రలో కంగనా రనౌత్ కనిపిస్తుంది. పోలియో బారిన పడ్డప్పటికీ కంగనా రెండుసార్లు గజినీ మొహ్మద్‌ను యుద్ధంలో ఓడించింది. ఈ పాత్రలో కంగనా రనౌత్ నటించడం నిజంగా సాహసమనే చెప్పాలి. చారిత్రాత్మక చిత్రంలో పోరాట యోధురాలిగా కంగనా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
రీసెంట్గా కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతుంది. ప్రస్తుతం తేజస్‌లో నటిస్తోంది కంగనా. ఈ సినిమాలను పూర్తి చేయడానికి ఈ ఏడాది పడుతుంది. తర్వాత‘మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాను 2022లో ప్రారంభిస్తారట.
Published by:
Anil
First published:
January 14, 2021, 10:20 PM IST