• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KANGANA INSTAGRAM DELETED KANGANA RANAUT POST ON COVID 19 HERE ARE THE DETAILS TA

Kangana Instagram: ట్విట్టర్‌తో పాటు కంగనాకు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్..

Kangana Instagram: ట్విట్టర్‌తో పాటు కంగనాకు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్..

కంగనా పోస్ట్ (Instagram/Photo)

Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేలా మాట్లాడుతుంది కంగనా రనౌత్. దీంతో ఈమె ఒక్కొసారి ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూనే ఉంది.

  • Share this:
    Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేలా మాట్లాడుతుంది కంగనా రనౌత్. దీంతో ఈమె ఒక్కొసారి ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూనే ఉంది. ఈమె పోస్ట్‌లు ఒక్కోసారి వివాదానికి దారి తీస్తుంటాయి. రీసెంట్‌గా కంగనా .. బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన అల్లర్లపై ట్విట్టర్‌లో మమత బెనర్జీని విమర్శిస్తూ ఆమె పోస్టులు చేయడంపై వివాదం చెలరేగింది. దీంతో ట్విట్టర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ కంగనా పోస్టులు పెట్టినందుకు కాను.. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్ .. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని ఆమెను సమర్ధించే వారు కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ట్విట్టర్ కంగనా పై సరైన చర్యలు తీసుకున్నారని ఆమెను విమర్శించేవారు అంటున్నారు.

    ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్.. కంగనా తనకు కోవిడ్ వచ్చినట్టు పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేసింది. కంగనా రీసెంట్‌గా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలియజేసింది. అంతేకాదు ఈ మహామ్మారిని చిన్నపాటి ఫ్లూగా అభివర్ణించింది. ఈమె పోస్ట్ పై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోసారు. కరోనాను కంగనా తేలికగా తీసుకుందని.. ఈమె పోస్ట్ చూసినవాళ్లు అందరు కరోనాను తేలికగా తీసుకుంటారని సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్... కంగనా పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఈ సందర్భంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ తీరును ఎండగడుతూ .. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కరోనాను అంతం చేద్దామని నేను చేసిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలిగించింది. ఎందుకంటే ఈ పోస్ట్ వలన  ఉగ్రవాదులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు కేవలం ట్విట్టర్‌లోనే ఉన్నారనుకున్నాను. ఇపుడే అర్ధమైంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి వారున్నారంటూ తన ఆవేదనను వెల్లగక్కారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: