హోమ్ /వార్తలు /సినిమా /

Kandikonda Passed Away : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ పాటల రచయత కందికొండ కన్నుమూత..

Kandikonda Passed Away : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ పాటల రచయత కందికొండ కన్నుమూత..

2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు. ఈ రెండున్నర  వ్యవధిలో పలువరు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. తాజాగా ప్రముఖ పాటల రచయత కందికొంద క్యాన్సర్‌తో బాధ పడుతూ కన్నుమూసారు.

2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు. ఈ రెండున్నర  వ్యవధిలో పలువరు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. తాజాగా ప్రముఖ పాటల రచయత కందికొంద క్యాన్సర్‌తో బాధ పడుతూ కన్నుమూసారు.

2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు. ఈ రెండున్నర  వ్యవధిలో పలువరు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. తాజాగా ప్రముఖ పాటల రచయత కందికొంద క్యాన్సర్‌తో బాధ పడుతూ కన్నుమూసారు.

  Kandikonda Passed Away | 2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు. ఈ రెండున్నర  వ్యవధిలో పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ గత కొంత కాలంగా కాన్సర్‌తో బాధపడుతూ.. కాసేటి క్రితమే కన్నుమూసారు. ఈయన పూర్తి పేరు కంది కొండ యాదగిరి. ఈయన వయసు 49.

  ముఖ్యంగా తెలంగాణ యాస, భాష, సంస్కృతి ప్రజలకు చేరువ చేసారు. తెలంగాణ సంస్కృతి పై ఎన్నో గీతాలను రాశారు. ముఖ్యంగా ఆయన పాట రాస్తే పదాలు గలగల పారే గోదారిలా పరుగులు పెడతాయి. కొమ్మల మాటున గువ్వలు మళ్లీ మళ్లీ  కూస్తాయి. మనసుండే చోటు చెప్పమంటూ ప్రేక్షకుల హృదయాలను ప్రశ్నిస్తాయి. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపాకే అంటూ యుతతరాన్ని ఉర్రూతలూగిస్తాయి. మాస్, మెలోడి, రొమాంటిక్, లవ్.. ఎలాంటి పాట అయినా సరే ఆయన కలం నుంచి జాలువారితే.. పాటకు ప్రాణం వస్తుంది. ఆయనే తెలుగు సినీ సాహిత్యంలో నయాట్రెండ్ సెట్ చేసిన రచయిత కందికొండ.

  Radhe Shyam US Premiers : ’రాధే శ్యామ్’ సహా ఓవర్సీస్‌లో US ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

  1973 అక్టోబర్ 13న వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలోని నాగురపల్లె గ్రామంలో పుట్టాడు కందికొండ. ఆయనకు చిన్నతనం నుంచి సాహిత్యం అంటే ప్రాణం. దాంతో డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో ఉన్న అనుబంధంతో పాటల రచయితగా ఇండస్ట్రీలో తనదైన ముద్రని వేసుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలోని మల్లికూయవే గువ్వా కందికొండ రాసిన ఫస్ట్ సాంగ్. ఈ సాంగ్ హిట్ కావడమే కాదు.. చక్రికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన అన్ని సినిమాల్లో కందికొండ పాటలు రాశారు. ఆయన పాటలు హిట్ అయినా.. ఆయనకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు.కలంతో పదాల సంకలనం. సాహిత్యంతో సంగమం. పదాలతో పాటల ప్రయోగం. అన్నింటా ఆరితేరిన సాహితికొండ కందికొండ.. 2001లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కందికొండ తక్కువ టైంలో వెయ్యి పాటల టార్గెట్ ను పూర్తి చేశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన చివరగా శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతల రాయుడు’ సినిమాలో ‘ఓ తలపై’ పాటను రాశారు. 

  Radhe Shyam : 2022లో ప్రభాస్ ’రాధే శ్యామ్’ మరో రికార్డు.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ దూకుడు..

  గతంలో కందికొండ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆయన ఆస్పత్రి చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు.  ఈ మేరకు రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. కందికొండ గత కొన్ని రోజులుగా త్రోట్ క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. దీంతో చికిత్సలో భాగంగా రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  First published:

  Tags: Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు