రూ.కోటిన్నర ఖర్చుతో 1400 మంది డ్యాన్సర్లు.. లారెన్స్ దుమ్మురేపుతున్నాడా?

కాంచన 3 సినిమా కోసం తీస్తున్న పాటలో 1400 మంది డ్యాన్సర్లలో 400 మంది అఘోరా గెటప్స్‌లో కనిపించనున్నారు.

news18-telugu
Updated: April 14, 2019, 7:12 PM IST
రూ.కోటిన్నర ఖర్చుతో 1400 మంది డ్యాన్సర్లు.. లారెన్స్ దుమ్మురేపుతున్నాడా?
లారెన్ప్ రాఘవేంద్ర
news18-telugu
Updated: April 14, 2019, 7:12 PM IST
కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారి హార్రర్ కామెడీలో సంచలనాలు సృష్టిస్తున్న రాఘవ లారెన్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ చేపట్టాడు. కాంచన 3 సినిమా కోసం 1400 మంది డ్యాన్సర్లు, రూ.కోటి 30లక్షల ఖర్చుతో భారీ సాంగ్ షూట్ చేయనున్నాడు. గతంలో ముని, కాంచన, కాంచన 2 సినిమాలతో రాఘవ లారెన్స్ ఆకట్టుకున్నాడు. గత సినిమాలు సక్సెస్ కొట్టాయి. వాటికి మించి కాంచన 3ని సక్సెస్ చేయాలని ఈసారి క్రేజీ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. కాంచన 3 సినిమాని తెలుగులో నిర్మాత బి.మధు రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 19న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 1400 మంది డ్యాన్సర్లలో 400 మంది అఘోరా గెటప్స్‌లో కనిపించనున్నారు.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...