కమ్మరాజ్యంలో కడప రెడ్లు సెకండ్ ట్రైలర్ విడుదల...

Kamma Rajyam Lo Kadapa Reddlu second trailer : రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమాకు సంబందించి ఓ ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ, తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేశాడు.

news18-telugu
Updated: November 20, 2019, 9:59 AM IST
కమ్మరాజ్యంలో కడప రెడ్లు సెకండ్ ట్రైలర్ విడుదల...
Twitter
  • Share this:
రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌తోనే కావాల్సినంత ప్రచారాన్ని రూపాయి ఖర్చు లేకుండా పొందాడు వర్మ. మరోవైపు ఈ సినిమాకు సంబందించి పూటకో పోస్టర్‌, లేదా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ.. అంచనాలు బాగానే పెంచాడు. కాగా గతంలో ఈ సినిమాకు సంబందించి ఓ ట్రైలర్ విడుదల చేసిన వర్మ తాజాగా మరో  ట్రైలర్‌ను విడుదల చేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ పోస్టర్‌లో వర్మ పప్పులాంటి అబ్బాయి, అతని తండ్రి  ఆటో నడుపుతున్నట్లు చూపించగా.. ట్రైలర్‌లో మాత్రం దానికి సంబందించి ఏమి చూపించలేదు.  ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా చేసుకుని ఈ తాజా ట్రైలర్‌లో చూపించినట్లు కనబడుతోంది.  కాగా ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తుండగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు . ఇక  ఈ సినిమాను ఈ  నెల 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ.

రాశీ ఖన్నా..హాట్ పిక్స్..



First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు