రాంగోపాల్ వర్మ వడ్డించిన పప్పు లాంటి అబ్బాయి ఇతనే...రియల్ లైఫ్‌లో ఏం చేసేవాడో తెలుసా...?

నిజజీవితంలో పాత్రలను పోలిన వ్యక్తులను గుర్తించి రీల్ లైఫ్ లో ప్రాణ ప్రతిష్ట చేయడం దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు సరదా. గతంలో కిల్లింగ్ వీరప్పన్, 9/11 ముంబై అటాక్స్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల్లో నిజజీవితంలోని పాత్రలను పోలిన వ్యక్తులను సినిమాలో చూపించి అందరినీ థ్రిల్ లో ముంచెత్తాడు వర్మ.

news18-telugu
Updated: November 8, 2019, 7:30 PM IST
రాంగోపాల్ వర్మ వడ్డించిన పప్పు లాంటి అబ్బాయి ఇతనే...రియల్ లైఫ్‌లో ఏం చేసేవాడో తెలుసా...?
(Image: facebook)
  • Share this:
రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా రోజుకో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదల చేసిన పప్పులాంటి అబ్బాయి పాత్ర ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత కుమారుడిని ఉద్దేశించినట్లు కనిపిస్తోందని వాదనలు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ పాటలో ప్రముఖ పాత్రలో కనిపించిన పప్పు లాంటి అబ్బాయి వేషం వేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజజీవితంలో పాత్రలను పోలిన వ్యక్తులను గుర్తించి రీల్ లైఫ్ లో ప్రాణ ప్రతిష్ట చేయడం దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు సరదా. గతంలో కిల్లింగ్ వీరప్పన్, 9/11 ముంబై అటాక్స్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల్లో నిజజీవితంలోని పాత్రలను పోలిన వ్యక్తులను సినిమాలో చూపించి అందరినీ థ్రిల్ లో ముంచెత్తాడు వర్మ. అయితే తాజాగా నిర్మిస్తున్న కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమాలో అయితే మరో అడుగు ముందుకేసి, నిజజీవితంలోని పలువురు రాజకీయ నేతల పాత్రలను అదే పోలికలతో ఉన్న వ్యక్తులతో చేయించి వర్మ తన దర్శకత్వ ప్రతిభను చాటి చెప్పాడు.

మరి ఈ సినిమాలోని పప్పు లాంటి అబ్బాయి నిజజీవితంలో ఎవరంటే గతంలో వైరల్లీ అనే యూట్యూబ్ చానెల్ లోని వెబ్ సిరీస్ లలో నటించే ధీరజ్ అని తేలింది. ఇతడు ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనుభవం ఉంది. అయితే ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో ఒకడిగా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉందని ఇప్పటికే ధీరజ్ తెలిపాడు.
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading