సూపర్‌స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ మంచి స్నేహితులు. నటన పరంగా, క్రేజ్‌పరంగా ఇద్దరూ పెద్ద శిఖరాలు. ఇప్పటికే కమల్‌హాసన్ సినీ రంగంలో ఉంటూనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలోనే తలైవా రజినీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనిపై కమల్‌హాసన్‌ను రీసెంట్‌గా స్పందించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేస్తాననే దానిపై క్లారిటీ ఇస్తానని కమల్ హాసన్ తెలిపారు. ఒకవైపు సినిమాలు, బుల్లితెరపై బిగ్‌బాస్‌తో పాటు వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్న కమల్.. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తనదైన స్పందనను తెలియజేశారు.
రజినీకాంత్ రాకను స్వాగతిస్తున్నామని కమల్ తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే ఇద్దరం కలిసి సినిమా చేయబోతున్నట్లు కమల్ తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించి ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కమల్ తెలిపారు. డిసెంబర్ 31న పార్టీ పేరుని అనౌన్స్ చేసి వచ్చే జనవరి నుండి పార్టీని స్టార్ట్ చేయడానికి రజినీకాంత్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాను చేస్తున్నారు. మరోవైపు భారతీయుడు 2 సినిమాను సెట్స్‌పై తీసుకెళ్లడానికి కమల్ తన వంతు ప్రయత్నాలు బలంగానే చేస్తున్నారు. ఇక రజినీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అణ్ణాతే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమాను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నయనతార, కీర్తసురేశ్, ఖుష్బూ, మీనా తదితరులు నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamal haasan, Rajnikanth