రివ్యూ : విక్రమ్ (Vikram )
నటీనటులు : కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తదితరులు
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
సంగీతం: అనిరుథ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. రవీంద్రన్
కథ,దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సినిమాలంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు అంతే ఆసక్తిగా ఎదురు చూసేవారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌లేని ఈయన తమిళంలో ఖైదీ, మాస్టర్ వంటి వరుసగా విజయాలతో దూకుడు మీదున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ మూవీ చేసారు. మరి ఈ మూవీతో కమల్ హాసన్ కమ్ బ్యాక్ అయ్యారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
‘విక్రమ్’ (కమల్ హాసన్) మాజీ ‘రా’ ఏజెంట్. అతని విధుల్లో భాగంగా కుటుంబం అతనికీ దూరమవుతోంది. గవర్నమెంట్ కూడా అతనికి సహకరించదు. ఈ నేపథ్యంలో అతను 30 యేళ్లు అండర్ గ్రౌండ్‌లో ఉంటాడు. తన కుటుంబానికి, దేశానికి చీడపురుగులా దాపురించిన డ్రగ్స్ మాఫియాను అంతం చేయడానికీ రంగంలో దిగుతాడు. ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఫహద్ ఫాజిల్ రంగంలోకి దిగుతాడు. మొత్తంగా తనను ఫ్యామిలీ నుంచి దూరం చేసిన డ్రగ్ మాఫియాను కమల్ హాసన్ ఎలా అంతం మొందించాడనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం విషయానికొస్తే..
కథ చిన్నదే అయినా.. దాన్ని అల్లుకున్న విధానం ఆకట్టుకుంటోంది. అందరికీ తెలిసిన కథను తనదైన స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. గవర్నమెంట్‌లో ఉన్న లొసుగుల కారణంగా ‘రా’ ఏజెంట్స్ ఎలా బలైపోతున్నారనేది ఈ సినిమాలో చక్కగా చూపించాడు. ప్రస్తుతం దేశంల డ్రగ్ మాఫియా ఎలా ఉంది. దాని వల్ల బలైన ఒక సీక్రెట్ ఏజెంట్.. దాన్ని ఎలా అంతం చేసాడనేది ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్ సాఫీగా సాగిపోయిన సినిమా.. కమల్ హాసన్ ఎంట్రీతో పీక్స్‌కు వెళుతోంది. ఇంటర్వెల్ తర్వాత కాస్త నెమ్మదించినా.. చివరి అరగంట ప్రేక్షకులను సీట్లలో కదలనీయకుండా చేయడంలో లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సాదాసీదా కథను తనదైన ఎలివేషన్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టేసాడు. ముఖ్యంగా తను తీయాలనకున్న కథకు కమల్ హాసన్, విజయ్ సేతుపతి వంటి పిల్లర్స్‌తోనే సగం సక్సెస్ అయ్యాడు. ఇక ఫహద్ ఫాజిల్.. చివర్లో సూర్య ఎంట్రీ అదుర్స్.. ఆయన పాత్ర ఏమిటనేది సినిమా చూస్తేనే మజా వస్తోంది. సెకండాఫ్ లెంగ్త్ తక్కువైతే బాగుండేది. సీరియస్ సినిమాలో కూడా ఎక్కడ ఎమోషన్ మిస్ అవ్వలేదు. ఇక కెమెరా మెన్ పనితనం.. అంతకు మించి ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అనిరుథ్ అసలు సిసలు హీరో అని చెప్పాలి. లోకేష్ విజువల్‌కు తనదైన బాణీలతో ఎక్కడికో తీసుకెళ్లాడు.
నటీనటుల విషయానికొస్తే..
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అన్నట్టు కమల్ హాసన్‌ను ఇలాంటి సీక్రెట్ ’రా’ ఏజెంట్ పాత్రలో చూసి చాలా కాలమైంది. గతంలో ఈయన ఇలాంటి తరహా పాత్రలను ఎన్నోచేసారు. ఒక సీక్రెట్ ‘రా’ (RAW) ఏజెంట్ పాత్రను 66 ఏళ్ల వయసులో చేయాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. మొత్తంగా చాలా ఏళ్లకు కమల్ హాసన్ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ హీరో పాత్రలో కనిపించారు. విజయ్ సేతుపతి పాత్ర మొత్తం సినిమా మొత్తం రన్ అవుతోంది. కమల్ హాసన్ వంటి లోకనాయకుడు ఉన్న.. తనదైన ఉనికి చాటుకుని నటుడిగా గట్టి పోటీ ఇచ్చాడు. ఫహద్ ఫాజిల్ తనదైన రీతిలో అల్లుకుపోయాడు. క్లైమాక్స్‌లో సూర్య ఎంట్రీ అదుర్స్.
ప్లస్ పాయంట్స్
కమల్ హాసన్, విజయ్ సేతుపతిల నటన..
లోకేష్ కనగరాజ్ టేకింగ్..
అనిరుథ్ రీ రికార్డింగ్
యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్
మైనస్ పాయింట్స్
రొటిన్ డ్రగ్ మాఫియా కథ
రన్ టైమ్..
సెకండాఫ్
చివరి మాట : యాక్షన్ ప్యాకడ్ స్టైలిష్ ఎంటర్టేనర్
రేటింగ్ : 3/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Lokesh Kanagaraj, Tollywood, Vikram