కెవ్వుకేక పుట్టిస్తోన్న కమల్ హాసన్, విక్రమ్‌ల ‘కదరమ్ కొండమ్’ టీజర్

Kamal Haasan, Vikram's Kadaram Kondam Teaser Released | గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో ఉన్న కథనాయకులు..ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. అందులో కొంత మంది హీరోలు...వేరే కథానాయకులతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తాజా కమల్ హాసన్..తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై చియాన్ విక్రమ్ హీరోగా ‘కదరం కొందన్’ అనే తమిళ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

news18-telugu
Updated: January 15, 2019, 12:24 PM IST
కెవ్వుకేక పుట్టిస్తోన్న కమల్ హాసన్, విక్రమ్‌ల ‘కదరమ్ కొండమ్’ టీజర్
కమల్ హాసన్, విక్రమ్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో ఉన్న కథనాయకులు..ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. అందులో కొంత మంది హీరోలు...వేరే కథానాయకులతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తాజా కమల్ హాసన్..తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై చియాన్ విక్రమ్ హీరోగా ‘కదరం కొందన్’ అనే తమిళ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రాన్ని గతంలో కమల్ హాసన్‌తో ‘చీకటి రాజ్యం’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన రాజేస్ ఎం సెల్వ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ జేమ్స్ బాండ్ సినిమా తరహాలో తెరకెక్కించారు.‘కదరం కొందన్’  కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ కూడా నటించింది. మొత్తానికి ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఓ రేంజ్‌లో ఉంది. మొత్తానికి ఫ్లాపుల్లో ఉన్న కమల్ హాసన్, విక్రమ్‌లు కలిసి చేస్తోన్న ఈ సినిమాతో వీళ్లిద్దరు సక్సెస్ అందుకుంటారా లేదా వెయిట్ అండ్ సీ.

ఇవి కూడా చదవండి 

కమల్ హాసన్ లాస్ట్ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..

అటు రాధాకృష్ణ కుమార్.. ఇటు సుజీత్.. మధ్యలో ప్రభాస్..రజినీకాంత్‌తో మురుగదాస్ మరో ‘ఠాగూర్’.. లంచంపై పోరాటం..
First published: January 15, 2019, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading