KAMAL HAASAN VIKRAM SUPER RESPONCE IN BOOK MY SHOW APP HERE ARE THE DETAILS TA
Kamal Haasan - Vikram : కమల్ హాసన్ ’విక్రమ్’ మరో రికార్డు.. అక్కడ రచ్చ చేస్తోన్న లోక నాయకుడు మూవీ..
కమల్ హాసన్ ‘విక్రమ్’కు అక్కడ సూపర్ రెస్పాన్స్ (Twitter/Photo)
Kamal Haasan | Vikram : యూనివర్సల్ వెర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా బుక్ మై షోలో మరో రికార్డు క్రియేట్ చేసింది.
Kamal Haasan - Vikram | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం (Vikram) ‘విక్రమ్’ అనే సినిమా చేసారు. ఈ సినిమాకు (Lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ పాట విడుదలై మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంటుండగా.. ఈ సినిమా తమిళ ట్రైలర్ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్‌ను చూస్తుంటే.. ఈ సినిమాలో కమల్‌హాసన్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.రీసెంట్గా విడుదలైన ఈ మూవీ తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. అందులో భాగంగా శ్రేష్ఠ్ మూవీస్ జోరుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు బుక్ మై షోలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాను 2 మిలియన్స్ పైగా ఇంట్రెస్ట్ నమోదు కావడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా నేషనల్ వైడ్‌గా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది.
బుక్ మై షోలో కమల్ హాసన్ ‘విక్రమ్’కు సూపర్ రెస్ఫాన్స్ (Twitter/Photo)
ఇక యాక్షన్ సీన్స్‌కు తగ్గట్లుగా అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ట్రైలర్ సినిమాలపై అంచనాలను మరో రేంజ్‌కు తీసుకు వెళ్లింది. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు డబ్బింగ్ రైట్స్ దాదాపు రూ.11 కోట్ల వరకు అమ్ముడు పోయాయట. ఇక్కడ విశేషమేమంటే.. కమల్ హాసన్ తెలుగులో హిట్టు సినిమాలు లేక పది యేళ్లు దాటింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 53 నిమిషాలు ఉంది.
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం' యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. అయిన ఈ సినిమాకు పదకొండు కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ కూడా కలిసివచ్చిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. లోకేష్ (lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. ఇక మరో కారణం (Vikram) ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ నటించడం కూడా కలిసి వచ్చింది.
ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. విక్రమ్ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ బ్యానర్లో వచ్చే 50వ సినిమా. ఇక ఈ సినిమా దర్శకుడు (Lokesh kanagaraj) లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే.. ఆయన కార్తితో ఖైదీ,.. ఆ తర్వాత విజయ్‌తో 'మాస్టర్' సినిమాలను తెరకెక్కించారు. దీంతో విక్రమ్ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.