Home /News /movies /

KAMAL HAASAN VIKRAM MOVIE SUPER RESPONCE IN DISNEY HOT STAR OTT TA

Vikram Movie : డిస్నీఫ్లస్ హాట్ స్టార్‌లో హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించిన కమల్ హాసన్ ‘విక్రమ్’..

డిస్నీ హాట్ స్టార్‌లో విక్రమ్ మూవీకి సూపర్ రెస్పాన్స్ (Twitter/Photo)

డిస్నీ హాట్ స్టార్‌లో విక్రమ్ మూవీకి సూపర్ రెస్పాన్స్ (Twitter/Photo)

Kamal Haasan | Vikram Streaming : కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా విక్రమ్. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా దాదాపుగా థియేటర్ రన్ ముగించుకోవడంతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇంకా చదవండి ...
    Kamal Haasan - Vikram Movie |  కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశారు.  ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది విక్రమ్. ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకున్నారు కమల్ హాసన్. ఈ నెల 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సినిమా దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించి, ఓటీటీలో రికార్డ్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు కన్నడ, మలయాళ ఆప్షన్స్ ఇచ్చింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ ఐదు భాషల్లోనూ రికార్డ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటోంది విక్రమ్.

    ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ..విక్రమ్ చిత్రాన్ని ప్రేక్షకులు అందించిన అపూర్వ విజయం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రతి ఇంటికీ విక్రమ్ చేరుకుంది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. మా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్ అన్నారు.



    డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ...మా ఓటీటీలో విక్రమ్ సాధిస్తున్న రికార్డ్ నెంబర్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు క్లాసిక్ మూవీ అనే పేరు తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ వ్యూయర్ షిప్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్ ను అందించింది. ఇంత గొప్ప సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం ఆనందంగా ఉంది. కమల్ హాసన్ స్టార్ డమ్ ను విక్రమ్ మరోసారి ప్రూవ్ చేసింది. అన్నారు.

    Chiranjeevi : చిరంజీవి ‘రాజా విక్రమార్క’కు రజినీకాంత్ క్లాప్.. తెర వెనక స్టోరీ ఇదే..


    ఇక అది అలా ఉంటే విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తాజాగా 400 కోట్ల క్లబ్‌లో చేరింది. రజనీకాంత్ 2.0 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన 2వ తమిళ సినిమా విక్రమ్. ఈ సినిమా ఇప్పటి వరకు 404 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. వీటిలో 120 కోట్ల రూపాయల వసూళ్లను ఓవర్సీస్ నుండి వచ్చాయి. ఇక మరోవైపు ఈ చిత్రం తమిళనాడులో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ తమిళనాడు రాష్ట్రంలో 155 కోట్లు రాబట్టి కేక పెట్టించింది. ఇక కమల్ విక్రమ్ దాదాపుగా మూడు వారాల్లో 155 కోట్లకు పైగా రాబట్టింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Disney+ Hotstar, Kamal haasan, Kollywood, Tollywood, Vikram Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు