Kamal Haasan | Vikram Collections | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా (Lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విక్రమ్ (Vikram). ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ముఖ్యపాత్రల్లో నటించారు. మరో తమిళ నటుడు సూర్య (Suriya) కీలకపాత్ర పోషించారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు తెలుగుతో పాటు పలు భాషల ఆడియన్స్ నీరాజనం పలుకుతున్నారు. దీంతో తొలిరోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ని రాబట్టిన విక్రమ్.. రెండో రోజు కూడా అదే లెవెల్‌లో బాక్సాఫీస్ దాడి చేశారు. అన్ని ఏరియాల్లో కూడా చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టి జనం మెప్పు పొందుతున్నాడు ఈ విక్రమ్. మరి ఈ రెండు రోజుల్లో విక్రమ్ రాబట్టిన వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా..
తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా మంచి ఆదరణ పొందుతోంది విక్రమ్ సినిమా. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
దీంతో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.70 కోట్ల గ్రాస్‌ను 1.96Cr షేర్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజుకు వచ్చేసరికి 2.00Cr షేర్ రాబట్టడం విశేషం. మొత్తంగా చూస్తే ఈ రెండు రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 3.96CR నెట్ (7.46CR~ గ్రాస్) రాబట్టాడు విక్రమ్.
Ap TG ఏరియావైజ్ రెండో రోజు రిపోర్ట్ చూస్తే..
Nizam: 83L
Ceeded: 24L
UA: 26L
East: 17L
West: 12L
Guntur: 15L
Krishna: 14L
Nellore: 9L
AP-TG టోటల్: 2.00CR(3.76CR~ గ్రాస్)
తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు 7Cr ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విక్రమ్.. 7.50Cr బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగాడు. ఈ రెండు రోజుల్లో కలిపి 3.96CR నెట్ రాబట్టాడు. మరో 3.54Cr రాబడితే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయినట్లే.
ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుతున్న విక్రమ్.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి రెండో రోజు రూ. 19.60 కోట్లు షేర్ రాబట్టాడు. దీంతో 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 50.80 కోట్ల షేర్‌తో పాటు 100.26 కోట్లు గ్రాస్ వసూలైంది. వరల్డ్ వైడ్ 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో.. మరో 30 కోట్లు రాబడితే ఈ సినిమా క్లాన్ హిట్ అయినట్లు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. హాట్ స్టార్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలకు చెందిన ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamal haasan, Lokesh Kanagaraj, Vijay Sethupathi, Vikram