Kamal Haasan | Vikram Collections | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ సినిమా (Vikram) ‘విక్రమ్’. ఈ సినిమాకు (Lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. మరో తమిళ నటుడు సూర్య (Suriya) కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా జూన్ 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. విక్రమ్ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 3.70 కోట్ల గ్రాస్‌ను 1.96 షేర్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. మొదటి రోజు విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 50. 75 కోట్ల గ్రాస్‌ను అందుకుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. హాట్ స్టార్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలకు చెందిన ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుందని తెలుస్తోంది.
విక్రమ్ మొదటి రోజు కలెక్షన్స్
Nizam: 66L
Ceeded: 27L
UA: 30L
East: 18L
West: 13L
Guntur: 15L
Krishna: 14L
Nellore: 10L
AP-TG Total : 1.96 కోట్లు (3.70 కోట్లు)
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ 8 కోట్ల రేంజ్‌లో ఉండగా.. 8.50 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా ఇంకా ఈ సినిమా 6.54 కోట్ల షేర్‌ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది.
విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
Tamilnadu – 22.05Cr
Telugu States- 3.70Cr
Karnataka- 4.02Cr
Kerala – 5.20Cr
ROI – 1.26Cr
Overseas – 14.50CR
Total WW collection – 50.75CR
ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాలకు హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విక్రమ్ తమిళ, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 5000 వేల కి పైగానే స్క్రీన్ లలో రిలీజ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం' యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు తెలుగులో అనుకున్నంతగా అలరించలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం మంచి బజ్ వచ్చింది. దీనికి ఈ సినిమా దర్శకుడు కూడా ఓ కారణం అయ్యి ఉండోచ్చు.
Thank you audience for the overwhelming response to our Ulaganayagan 's #Vikram!#VikramRoaringSuccess@ikamalhaasan @anirudhofficial @Dir_Lokesh @Udhaystalin @VijaySethuOffl #FahadhFaasil #Mahendran @RKFI @turmericmediaTM @spotifyindia @SonyMusicSouth @RedGiantMovies_ pic.twitter.com/tryUkNuVf5
— Raaj Kamal Films International (@RKFI) June 4, 2022
లోకేష్ (lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. ఇక మరో కారణం (Vikram) ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ నటించడం కూడా కలిసి వచ్చింది. ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇది ఆ బ్యానర్‌లో వచ్చే 50వ సినిమా. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamal haasan, Lokesh Kanagaraj, Tollywood news, Vikram Movie