హోమ్ /వార్తలు /సినిమా /

Vikram : ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌తో విక్రమ్, మేజర్ సినిమాల టిక్కెట్ రేట్స్ తగ్గింపు..

Vikram : ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌తో విక్రమ్, మేజర్ సినిమాల టిక్కెట్ రేట్స్ తగ్గింపు..

విక్రమ్, మేజర్ సినిమాలకు టికెట్ రేట్స్ తగ్గింపు (Twitter/Photo)

విక్రమ్, మేజర్ సినిమాలకు టికెట్ రేట్స్ తగ్గింపు (Twitter/Photo)

Major To Vikram  | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ ఇష్యూ బాగా నడుస్తోంది. తాజాగా ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌తో ఇపుడు మేజర్, విక్రమ్ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ తగ్గించారు.

Major To Vikram  | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ ఇష్యూ బాగా నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి మరీ టికెట్ రేట్స్ పెంచుకునేలా చేసుకున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం అడిగిందే తడువుగా ఇక్కడ థియేటర్స్‌లో టికెట్ ధరలను అమాంతం డబుల్ చేసేసింది. మా సినిమాలకు అంతా ఖర్చు పెట్టాం. ఇంత ఖర్చు పెట్టాం అని చెప్పి.. ఆర్ఆర్ఆర్ సినిమాకు పెరిగిన టిక్కెట్ రేట్స్‌‌కు అదనంగా రూ. 100 నుంచి రూ. 50 వరకు 10 రోజుల పాటు పెంచినా.. ప్రేక్షకులు కూడా అంత పెట్టి ఆ సినిమాను చూసారు. పైగా రాజమౌళి.. ఇద్దరు మాస్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చారిత్రక నేపథ్యమున్న సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా పెరిగిన టికెట్ రేట్‌ను అంతగా పట్టించుకోకుండా ఆ సినిమాను ఆదరించారు. ఆ తర్వాత రెండు వారాలకు విడుదలైన కేజీఎఫ్ 2కు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం పాటు రూ. 50 పెంచుకునేందకు ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు.

మాములు స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ ప్యాన్ ఇండియా మూవీకి కూడా టికెట్ రేట్స్ హైక్ ఓ రకంగా లాభమే చేసింది. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్.. ఆచార్య సినిమా దగ్గరకు వచ్చేసరికి పెరిగిన టికెట్ రేట్స్ కు అదనంగా రూ. 50 రూపాయలు పెంచడంతో తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా టికెట్ ధర 345 రూపాయలకు పెరిగింది. ఇక ఈ సినిమాకు బ్యాడ్ టాక్ రావడం.. పెరిగిన టికెట్ రేట్స్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేయాలంటేనే భయపడే స్థితికి వచ్చింది.

Telangana Directors in Tollywood : తెలుగు వెండితెరపై సత్తా చూపెడుతున్న తెలంగాణ దర్శకులు వీళ్లే..

ఆ తర్వాత మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు కూడా రూ. 50 రూపాయలు అదనపు ఛార్జీలతో ఈ సినిమాను విడుదల చేసారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. పెరిగిన టికెట్ రేట్స్ కారణంగా బీ,సీ సెంటర్ ప్రేక్షకులు ఆ రేటు చూసి థియేటర్ వైపు అడుగులు వేయడానికి భయపడ్డారు. దీంతో అలర్ట్ అయిన దిల్ రాజు.. మా సినిమాకు టికెట్ ధర తగ్గించాం.  ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమా చూడొచ్చు అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ధరలు అంటే మల్టీప్లెక్స్‌లో రూ. 295 , మామలు థియేటర్స్‌లో రూ. 175 . ఈ రేట్స్ కూడా కామన్ ఆడియన్స్‌ను భయపెట్టాయి. దీంతో ఎఫ్ 3  టాక్ తగ్గట్టు కలెక్షన్స్ లేవనే విషయం తెలుస్తోంది. అదే తక్కువ రేటుతో విడుదలైన ఎఫ్ 2 మూవీ తక్కువ రేటుతో ఎక్కువ వసూళ్లను సాధించింది.

Tollywood Telangana: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అంటే..

ఆర్ఆర్ఆర్ సినిమాను  టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్న అది ఓ ప్రత్యేక సందర్భంలో చూసారు. దీంతో తత్త్వం బోధపడినట్టు.. ఇపుడు మేజర్, కమల్ హాసన్ విక్రమ్ సినిమాలకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్ తగ్గించినట్టు మరి ప్రచారం చేస్తున్నారు.  తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో రూ. 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్‌లో  రూ. 147 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్ కి, 177 రూపాయలు  ఉండనున్నాయి. మరి తగ్గిన టికెట్ రేట్స్‌తో  విక్రమ్, మేజర్ సినిమాలకు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.

First published:

Tags: Adivi Sesh, Kamal haasan, Major film, Tollywood, Vikram

ఉత్తమ కథలు