Kamal Haasan-Lokesh Kanagaraj : ఖైదీ దర్శకుడితో కమల్.. రాజకీయ నేపథ్యంలో...

Kamal Haasan-Lokesh Kanagaraj : లోకనాయకుడు కమల్‌హాసన్‌‌, యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలసి పనిచేయనున్నారు.

news18-telugu
Updated: September 17, 2020, 12:17 PM IST
Kamal Haasan-Lokesh Kanagaraj : ఖైదీ దర్శకుడితో కమల్.. రాజకీయ నేపథ్యంలో...
కమల్ కొత్త సినిమా పోస్టర్ Photo : Twitter
  • Share this:
లోకనాయకుడు కమల్‌హాసన్‌‌, యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలసి పనిచేయనున్నారు. కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మించనున్న 50వ సినిమాలో రజనీకాంత్‌ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో కూడిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. ఇది విలక్షణ నటుడు కమలహాసన్ నటించే 232వ చిత్రం. యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఫ్రీ లుక్ ను చాలా గమ్మత్తుగా డిజైన్ చేసింది చిత్రబృందం. 'ఒకానొక సమయంలో అక్కడ ఒక దెయ్యం నివసించేది..' అనే అర్థం వచ్చేలా ఉండి ఆసక్తికరంగా ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు సమాచారం. ఇక కనకరాజ్ దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్‌ నటించిన 'మాస్టర్‌' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.


లోకేష్ దర్శకత్వంలో గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం 'ఖైదీ'. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా.. ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇటు తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, దానికి తోడు మంచి తండ్రి కూతురు సెంటిమెంట్.. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే రీతిలో కథ కథనాలు సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. కాగా ఈ ఖైదీ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగణ్‌ హీరోగా నటించనున్నాడు. ఈ హిందీ ఖైదీని కూడా లోకేష్ కనకరాజే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: September 17, 2020, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading