కమల్ హాసన్, శంకర్‌ల ‘భారతీయుడు 2’ సెట్స్‌పైకి వెళ్లేది అపుడే..

శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిన విషయమే కదా. ఈ సినిమాను తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది.రీసెంట్‌గా చైన్నైలో పూజా కార్యక్రమాలతో ‘ఇండియన్2’ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ త్వరలో మొదలు కానుంది.

news18-telugu
Updated: January 2, 2019, 11:03 AM IST
కమల్ హాసన్, శంకర్‌ల ‘భారతీయుడు 2’ సెట్స్‌పైకి వెళ్లేది అపుడే..
’భారతీయుడు2’గా కమల్ హాసన్
  • Share this:
శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిన విషయమే కదా. ఈ సినిమాను తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ‘భారతీయుడు2’ విడుదలైన 22 యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్‌లు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ చేస్తున్నారు.

‘భారతీయుడు’ సినిమాలో తండ్రీ కొడుకులుగా కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. అవినీతి, లంచగొండి తనానికి వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ చిత్రంలో కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌లో ఉన్న ముసలివాడి పాత్ర అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాలోనటనకు గాను కమల్ హాసన్..మూడోసారి జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.

శంకర్, కమల్ హాసన్


రీసెంట్‌గా చైన్నైలో పూజా కార్యక్రమాలతో ‘ఇండియన్2’ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ జనవరి 18న పొలాచ్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ తర్వాత చెన్నై, యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

భారతీయుడు సెట్‌లో కమల్ హాసన్, సుకన్యలకు సూచనలు చేస్తోన్న శంకర్


‘ఇండియన్2’ సినిమాను సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ భారీ ఎత్తున తెరకెక్కించనున్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, శింబులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నారు.

భారతీయుడు‌గా కమల్ హాసన్
మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ లేదా అక్షయ్ కుమార్ ‘ఇండియన్2’లో  నెగిటివ్ రోల్లో నటించనున్నారనే సమాచారం కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ‘భారతీయుడు2’ తర్వాత శంకర్ విజయ్‌తో ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు హృతిక్ రోషన్‌తో బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

Pics:2018లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ సినిమాలు




ఇది కూడా చదవండి 

రాజశేఖర్‌ 'కల్కి' ఫస్ట్‌లుక్‌ అదుర్స్

ఒక్క హిట్ ప్లీజ్.. ఫ్లాపుల్లో మునిగిపోయిన తెలుగు హీరోలు..

Pics: ‘సింబా’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో మరోసారి ప్రూవ్ అయిన ఖాకీ పవర్
Published by: Kiran Kumar Thanjavur
First published: January 2, 2019, 10:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading