కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేది అపుడే..!

శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ మూవీని తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఇప్పటి వరకు  ‘2.O’ రిలీజ్ ప్రోగ్రామ్‌లతో ఫుల్ బిజీగా ఉన్న శంకర్... డిసెంబర్ 14 నుంచి ‘ఇండియన్2’ మూవీకి సంబంధించిన షూటింగ్  స్టార్ట్ చేయనున్నాడు.ఈ మూవీని తెలుగులో ‘భారతీయుడు2’ పేరుతో రిలీజ్ కానుంది.

news18-telugu
Updated: November 30, 2018, 10:41 AM IST
కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేది అపుడే..!
’భారతీయుడు2’గా కమల్ హాసన్
  • Share this:
శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ మూవీని తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఈ మూవీ విడుదలైన 22 యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్‌లు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ చేస్తున్నారు.

‘భారతీయుడు’ లో తండ్రీ కొడుకులుగా కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. అవినీతి, లంచగొండి తనానికి వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ మూవీలో కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌లో ఉన్న ముసలివాడి పాత్ర అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్.

భారతీయుడులో కమల్ హాసన్


ఈ మూవీలో నటనకు గాను కమల్ హాసన్..మూడోసారి జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈ మూవీకి ఏ.ఆర్.రహమాన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.


భారతీయుడు సెట్‌లో కమల్ హాసన్, శంకర్


రీసెంట్‌గా చైన్నైలో పూజా కార్యక్రమాలతో ‘ఇండియన్2’ ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ డిసెంబర్ 14నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

భారతీయుడు 2 పూజా కార్యక్రమం
ఇప్పటి వరకు  ‘2.O’ రిలీజ్ ప్రోగ్రామ్‌లతో ఫుల్ బిజీగా ఉన్న శంకర్... డిసెంబర్ 14 నుంచి ‘ఇండియన్2’ మూవీకి సంబంధించిన షూటింగ్  స్టార్ట్ చేయనున్నాడు.ఈ మూవీని తెలుగులో ‘భారతీయుడు2’ పేరుతో రిలీజ్ కానుంది.

భారతీయుడు సెట్‌లో కమల్ హాసన్, సుకన్యలకు సూచనలు చేస్తోన్న శంకర్


ఈ సీక్వెల్‌లో కమల్ హాసన్ ముసలి తాత గెటప్‌కు సంబంధించి హాలీవుడ్ నుంచి కొంత మంది మేకప్‌మెన్స్ చెన్నైకి వచ్చి టెస్ట్ షూట్ కూడా చేశారట.ఈ టెస్ట్ షూట్ శంకర్‌ ఫుల్ హ్యాపీగా ఉన్నాట. ‘ఇండియన్2’ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను హైదారాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ బిగ్‌బాస్ 3 సీజన్‌కు హోస్ట్‌ చేయనున్నాడు.

కమల్ హాసన్


బిగ్‌బాస్ 3 చేస్తూనే..కమల్ హాసన్ ఈ సీక్వెల్ షూటింగ్ చేసుకునేలా చెన్నైలో బిగ్‌బాస్ 3 హౌస్ పక్కనే ప్రత్యేకంగా ఒక సెట్‌ను వేయనున్నారు. అక్కడే ‘ఇండియన్ 2’ మూవీకి సంబంధించిన షూటింగ్ చేయబోతున్నట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

శంకర్, కమల్ హాసన్


‘ఇండియన్2’ మూవీని ప్రస్తుత సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది. లైకా ప్రొడక్షన్ భారీ ఎత్తున తెరకెక్కించనున్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, శింబులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నారు.

భారతీయుడు‌గా కమల్ హాసన్


మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ లేదా అక్షయ్ కుమార్ ‘ఇండియన్2’లో  నెగిటివ్ రోల్లో నటించనున్నారనే  సమాచారం కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ‘భారతీయుడు’ లో సీబీఐ ఆఫీసర్ పాత్రను పోషించిన నెడుముడి వేణు ఈ మూవీలో మరోసారి సీబీఐ ఆఫీసర్ పాత్రను పోషించనున్నారు.

ఇండియన్ 2 పోస్టర్


అప్పట్లో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ‘భారతీయడు’లాగానే ఈ  సీక్వెల్ కూడా సంచలనాలకు వేదికగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 30, 2018, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading