news18-telugu
Updated: November 5, 2020, 7:03 PM IST
కమల్ హాసన్ (Twitter/Photo)
Kamal Haasan | యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. 2018 ఫిబ్రవరిలో ఈయన ‘మక్కల్ నీది మయ్యం’ అనే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసాడు. కానీ ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో కమల్ హాసన.. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలతో పాటు తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే..ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వాతావరణం ఇప్పటి నుంచే వేడెక్కింది. వచ్చే యేడాది మే లో తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్నాయి. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో రజినీకాంత్ కొత్త పార్టీతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడంతో పాటు తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు సోదరుడు రజినీకాంత్ పార్టీ పెడితే.. ఆయనతో కలిసి పనిచేయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపించాడు. మొత్తంగా వచ్చే యేడాది తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికి కమల్ హాసన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటు ఒకటి రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 5, 2020, 7:03 PM IST