Snehan - Kanika Ravi: పాటలు రాస్తూనే పడేసాడు.. హీరోయిన్‌తో ప్రముఖ గేయ రచయిత పెళ్లి..

స్నేహన్ కనిక రవి పెళ్లి (Snehan Kanika marriage)

Snehan - Kanika Ravi: కోలీవుడ్‌‌లో ఓ పాటల రచయితకు పడిపోయింది హీరోయిన్. ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. కమల్ హాసన్ సాక్షిగా పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఆ లిరిక్ రైటర్ పేరు స్నేహన్.. వధువు పేరు కనిక రవి.

  • Share this:
హీరోయిన్లు ఎప్పుడు ప్రేమలో పడిపోతారో తెలియకుండానే మనసు ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా కోలీవుడ్‌‌లో ఓ పాటల రచయితకు పడిపోయింది హీరోయిన్. ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. కమల్ హాసన్ సాక్షిగా పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఆ లిరిక్ రైటర్ పేరు స్నేహన్.. ఈయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. జులై 29న మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ సమక్షంలో బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి కనికను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్నేహన్‌ అధికారికంగా ప్రకటించాడు. స్నేహన్‌ సినీ రచయితగానే కాకుండా మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా కూడా ఉన్నాడు. ఈ మధ్యే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో కమల్‌తో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల పర్యటించాడు.. ప్రచారం కూడా చేసాడు.

అంతేకాదు అదే పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విరుగంబాక్కం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. ఈయనకు హీరోయిన్ కనిక రవితో కొన్నేళ్ళుగా స్నేహం ఉంది. 8 ఏళ్ళ కింద వచ్చిన ‘దేవరాట్టం’ అనే చిత్రంలో కనిక నటించింది. ఆ చిత్రానికి స్నేహన్ పాటలు రాసాడు. అదే సినిమా షూటింగ్‌ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
snehan kanika ravi,snehan kanika ravi marriage,mnm snehan kanika ravi marriage,kamal haasan snehan kanika ravi,telugu cinema,కమల్ హాసన్,మక్కల్ నీధి మయ్యం నేత స్నేహన్ కనిక రవి పెళ్లి
స్నేహన్ కనిక రవి పెళ్లి (Snehan Kanika marriage)

అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వాళ్లే కూర్చుని పెళ్లికి ముహూర్తం పెట్టారు. జులై 29 గురువారం వడళనిలోని గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో ఉదయం 10.45 గంటలకు వీళ్ళ పెళ్లి జరుగనుంది. ఈ పెళ్లిని కమల్‌ హాసన్‌ దగ్గరుండి జరిపించనున్నారు. స్నేహన్, కనిక పెళ్లికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు మక్కల్ నీది మయ్యం నేతలు హాజరు కానున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: