హోమ్ /వార్తలు /సినిమా /

Kamal Haasan | Vikram : కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు తెలుగులో భారీ డీల్..

Kamal Haasan | Vikram : కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు తెలుగులో భారీ డీల్..

Vikram Photo : Twitter

Vikram Photo : Twitter

Kamal Haasan | Vikram : విశ్వనటుడు కమల్ హాసన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే.

  విశ్వనటుడు కమల్ హాసన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్‌కు మంచి రేటు వచ్చిందని తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ రైట్స్ దాదాపు రూ.11 కోట్ల వరకు అమ్మడు పోయాయట. ఇక్కడ విశేషమేమంటే.. కమల్ హాసన్ తెలుగులో హిట్టు సినిమాలు లేక పది సంవత్సరాలు దాటింది. కమల్ హాసన్ హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం' యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. అయిన ఈ సినిమాకు పదకొండు కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ కూడా కలిసివచ్చిందని అంటున్నారు. లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. ఇక మరో కారణం ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ నటించడం కూడా కలిసి వచ్చింది.


  ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ ఆ టీజర్‌తో సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

  విక్రమ్ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల వాయిదా పడి మరోసారి పున: ప్రారంభమైంది. కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మించనున్న 50వ సినిమా. ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్‌ నటించిన 'మాస్టర్‌' చిత్రం పోయిన సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Kamal haasan, Lokesh Kanagaraj, Tollywood news

  ఉత్తమ కథలు