విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం (Vikram) విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు (lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ అనే మరో ఇద్దరు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ ఉన్న ఈ (Vikram) సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రకటనను సోషల్ మీడియాలో విడుదల చేశారు చిత్రబృందం. అంతేకాదు ఈ సినిమా విడుదల తేదీని మార్చి 14, 2022 న ఉదయం 7 గంటలకు ప్రకటించాలని ప్లాన్ చేసింది టీమ్. ఇక మరోవైపు (Vikram) ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్‌కు మంచి రేటు వచ్చిందని తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ రైట్స్ దాదాపు రూ.11 కోట్ల వరకు అమ్ముడు పోయాయట. ఇక్కడ విశేషమేమంటే.. కమల్ హాసన్ తెలుగులో హిట్టు సినిమాలు లేక పది సంవత్సరాలు దాటింది. కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం' యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. అయిన ఈ సినిమాకు పదకొండు కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ కూడా కలిసివచ్చిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. లోకేష్ (lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. ఇక మరో కారణం (Vikram) ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ నటించడం కూడా కలిసి వచ్చింది.
ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ ఆ టీజర్‌తో సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
#VIKRAM theatrical release date to be announced on March 14th,2022 at 7AM#VikramReleaseAnnouncement #KamalHaasan@ikamalhaasan @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @girishganges @anirudhofficial @turmericmediaTM pic.twitter.com/FV4CYos7Sc
— Raaj Kamal Films International (@RKFI) March 3, 2022
After 110 days of shoot it’s a WRAP ? Thanx to the entire cast and crew for the EXTRAORDINARY effort! ??@ikamalhaasan @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial #VIKRAM pic.twitter.com/5xwiFTHaZH
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 1, 2022
విక్రమ్ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ బ్యానర్‌లో వచ్చే 50వ సినిమా. ఇక ఈ సినిమా దర్శకుడు (lokesh kanagaraj) లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం పోయిన సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.