హోమ్ /వార్తలు /సినిమా /

Kamal Haasan | Vikaram : కమల్ హాసన్ పొలిటికల్ థ్రిల్లర్ విక్రమ్ ఫస్ట్ లుక్ విడుదల..

Kamal Haasan | Vikaram : కమల్ హాసన్ పొలిటికల్ థ్రిల్లర్ విక్రమ్ ఫస్ట్ లుక్ విడుదల..

Kamal Haasan  Photo : Twitter

Kamal Haasan Photo : Twitter

Kamal Haasan | Vikaram : కమల్ హాసన్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే పొలిటికల్ థ్రిల్లర్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

    విశ్వనటుడు కమల్ హాసన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి తాజాగా లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈరోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఉంటుందని చిత్ర దర్శకుడు లోకేష్ ట్విట్టర్‌లో తెలిపారు. ఈరోజు 5 గంటలకు విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ ఆ టీజర్‌తో సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.


    విక్రమ్ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల వాయిదా పడి మరోసారి పున: ప్రారంభమైంది. కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మించనున్న 50వ సినిమా. ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్‌ నటించిన 'మాస్టర్‌' చిత్రం పోయిన సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

    లోకేష్ దర్శకత్వంలో గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం 'ఖైదీ'. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, దానికి తోడు మంచి తండ్రి కూతురు సెంటిమెంట్.. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే రీతిలో కథ కథనాలు, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగణ్‌ హీరోగా నటిస్తున్నారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Kamal haasan, Lokesh Kanagaraj, Tollywood news

    ఉత్తమ కథలు