Home /News /movies /

KAMAL HAASAN LOKESH KANAGARAJ VIKRAM CENSOR COMPLETED HERE ARE THE DETAILS SR

Kamal Haasan | Vikram : కమల్ హాసన్ విక్రమ్ సెన్సార్ పూర్తి.. పద థియేటర్స్‌లో చూస్కుందాం..

Vikram-Censor Photo : Twitter

Vikram-Censor Photo : Twitter

Kamal Haasan | Vikram : కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం (Vikram) విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. దీంతో ఈ సినిమా తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

ఇంకా చదవండి ...
  విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం (Vikram) విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు (Lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) అనే మరో ఇద్దరు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ ఉన్న ఈ (Vikram) సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. దీంతో ఈ సినిమా తాజాగా సెన్సార్ (Vikram censor)  కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. చాలా రోజుల తరువాత కమల్ నుండి పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నామని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌తో అన్నారని సమాచారం. ఈ సినిమాను 153 నిమిషాలకు లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా జూన్ 3న విడుదలకానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌తో పాటు పాటలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్‌ను చూస్తుంటే.. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

  ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. అందులో భాగంగా శ్రేష్ఠ్ మూవీస్ జోరుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక యాక్షన్ సీన్స్‌కు తగ్గట్లుగా అనిరుధ్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ట్రైలర్‌ సినిమాలపై అంచనాలను మరో రేంజ్‌కు తీసుకు వెళ్లింది. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు డబ్బింగ్ రైట్స్ దాదాపు రూ.11 కోట్ల వరకు అమ్ముడు పోయాయట. ఇక్కడ విశేషమేమంటే.. కమల్ హాసన్ తెలుగులో హిట్టు సినిమాలు లేక పది సంవత్సరాలు దాటింది.


  కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం' యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. అయిన ఈ సినిమాకు పదకొండు కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ కూడా కలిసివచ్చిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. లోకేష్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. ఇక మరో కారణం (Vikram) ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ నటించడం కూడా కలిసి వచ్చింది.

  Kamal Haasan Vikram Super Responce in Book My Show App Here Are The Details,Kamal Haasan - Vikram : కమల్ హాసన్ ’విక్రమ్’ మరో రికార్డు.. అక్కడ రచ్చ చేస్తోన్న లోక నాయకుడు మూవీ..,Vikram Super Responce in Book My Show,Vikram Telugu Trailer released, Vikram theatrical trailer released, Kamal Haasan Vikram release date, Kamal Haasan lokesh kanagaraj Vikram telugu rights, Kamal Haasan lokesh kanagaraj Vikram first look, kamal haasan film,Lokesh Kanagaraj, fahad fasil , vijay sethupathi ,rajinikanth kamal haasan film update, kamal hassan news, lokesh kanak raj films,rajinikanth films, రజనీకాంత్, కమల్ హాసన్, టాలీవుడ్ న్యూస్,బుక్ మై షోలో కమల్ హాసన్ మూవీకి సూపర్ రెస్పాన్స్
  కమల్ హాసన్ ‘విక్రమ్’ (Twitter/Photo)


  ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ ఆ టీజర్‌తో సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. విక్రమ్ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ బ్యానర్‌లో వచ్చే 50వ సినిమా. ఇక ఈ సినిమా దర్శకుడు (Lokesh kanagaraj) లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్‌ నటించిన 'మాస్టర్‌' చిత్రం పోయిన సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు